రియా డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ వెలుగులోకి…సుశాంత్ క్రెడిట్ కార్డు పిన్ మార్చడానికి ట్రై?

రియా డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ వెలుగులోకి…సుశాంత్ క్రెడిట్ కార్డు పిన్ మార్చడానికి ట్రై?

by Mohana Priya

Ads

సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సిబిఐకి అప్పగించింది. సిబిఐ దర్యాప్తులో ఇప్పటివరకు వెలుగులోకి రాని ఎన్నో విషయాలు ఇప్పుడు బయటికి వస్తున్నాయి. రియా చక్రవర్తి మీద ముందునుండి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.

Video Advertisement

రియా చక్రవర్తి ఒక డ్రగ్ డీలర్ తో చేసిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది. రియా చక్రవర్తి గౌరవ్ ఆర్య అనే ఒక డ్రగ్ డీలర్ తో మిథైలిన్ డైఆక్సీ మెథం ఫెటమిన్ (MDMA) అనే డ్రగ్ గురించి అడిగారు. పవర్ ఎక్కువగా ఉన్న డ్రగ్స్ గురించి మాట్లాడాలి (హార్డ్ డ్రగ్స్). ఇప్పటివరకు నేను ఎక్కువగా వాడలేదు” అని అర్థం వచ్చేలా ఆ సంభాషణ ఉంది.

సుశాంత్ హోమ్ స్టాఫ్ శామ్యూల్ మిరాండా తో కూడా రియా చక్రవర్తి మాట్లాడారు. శామ్యూల్ రియా తో ” హాయ్ రియా స్టఫ్ దాదాపు అయిపోయింది” అని అనగా అందుకు రియా చక్రవర్తి “షోవిక్ (రియా చక్రవర్తి సోదరుడు) స్నేహితుడి దగ్గర నుండి తీసుకోవాలా? కానీ అతని దగ్గర హాష్ ఇంకా బడ్ (ఒక రకమైన డ్రగ్స్) మాత్రమే ఉన్నాయి” అని జవాబిచ్చారు.

అంతేకాదు  టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, రియా చక్రవర్తి శామ్యూల్ మిరాండా కి “ఏటీఎం కార్డ్ పిన్ నంబర్, లేదా స్మాల్ కార్డ్ పంపగలరా? పిన్ నెంబర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మార్చవచ్చు కదా?” అని అర్థం వచ్చేలాగా మెసేజ్ చేశారు.

తన టాలెంట్ మేనేజర్ జయ సాహా తో రియా చక్రవర్తి మాట్లాడిన వాట్సాప్ చాట్ లో “ఇవి పంపించినందుకు చాలా ఆనందంగా ఉంది” అని రియా చక్రవర్తి మెసేజ్ పంపితే, “ఇది ఏమైనా పని చేసిందా” అని అర్థం వచ్చేలా జయ అడిగారు. దానికి రియా “అవును. పని చేసింది. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యాడు. కేవలం రోజులో ఒకసారి మాత్రమే” అనే అర్థం వచ్చే లాగా జవాబిచ్చారు. రియా చక్రవర్తి శామ్యూల్ మిరాండా, ఇంకా జయ సాహా తో మాట్లాడిన ఈ చాట్ అంతా డిలీట్ అయిపోయిందట. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) రియా చక్రవర్తి మీద, ద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టన్సెస్ యాక్ట్ (ఎన్ డి పి ఎస్ యాక్ట్)  కింద కేస్ రిజిస్టర్ చేసిందట.


End of Article

You may also like