శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా ‘సామజవరగమన’.  ఈ చిత్రం జూలై 29న విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Video Advertisement

ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను పలు మార్లు చూసినవారు వాటిలోని మిస్టేక్స్ ను గమనిస్తూ, వాటి గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడం సాధారణం అయ్యింది. ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ఒక సీన్ గమనించిన ఓ నెటిజెన్ ట్విట్టర్ లో షేర్ చేయగా, నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. Samajavaragamana‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.

ఈ సినిమాలోనే డిలీటెడ్ సీన్ తాజాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. అందులో వెన్నెల కిశోర్ కామెడీ సూపర్ గా ఉంది. ఆ వీడియో ఒక లుక్ వేసేయండి.

watch video:

Also Read: “సామజవరగమన” లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా..?