తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా…పసివాడి ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ (వీడియో)

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా…పసివాడి ప్రాణాలు కాపాడిన డెలివరీ బాయ్ (వీడియో)

by Megha Varna

Ads

దేవుడు ఎక్కడున్నాడు ఎవరు అంటే… మనం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసేవాడే దేవుడు,ఉదాహరణకు అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ఆ సమయంలో మనల్ని అక్కడి నుండి తీసుకువెళ్ళేవారు ఎవరూ లేకపోతె ఆ సమయంలో మనకి లిఫ్ట్ ఇచ్చినవాడే ఆ సంఘటనకు సంబందించిన దేవుడు అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సందర్భంలో అన్నారు.ప్రస్తుతం చైనా లో జరిగిన ఓ సంఘటన సరిగ్గా ఈ మాటలకూ సరిపోతుంది.అపార్ట్మెంట్ పై నుండి కిందికి పడిపోయిన బాలుడిని ఓ డెలివరీ బాయ్ తన ప్రాణాలకు తెగించి కాపాడాడు..ఇప్పుడు అందరూ ఆ డెలివరీ బాయ్ నిజంగా దేవుడు అని అభివర్ణిస్తున్నారు..పూర్తి వివరాల్లోకి వెళ్తే ..

Video Advertisement

సోమవారం చైనా లో అపార్ట్మెంట్ రెండవ అంతస్తు నుండి అనుకోని పరిస్థితులలో ఓ బాలుడు కిందకి పడిపోయాడు.పక్కనే ఉన్న స్థానికులు బాలుడిని పైకి లాగడానికి శతవిధాలా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది.ఇంకా కొద్ది సమయంలో కిందకి పడిపోతాడు అనే సమయానికి అటు వైపుగా వెళ్తున్న డెలివరీ బాయ్ చూసి తన ప్రాణాలకు హాని జరుగుతుందా లేదా అని ఏమి ఆలోచించకుండా వెంటనే ఆ అపార్ట్మెంట్ పైకి ఎక్కి బాలుడుని కాపాడాడు.ఆ డెలివరీ బాయ్ పేరు జియూజున్ .ప్రస్తుతం దీనికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జియూజున్ సరైన సమయంలో దేవుడిలా వచ్చి ఆ పిల్లవాడిని కాపాడాడని లేకపోతే ఆ పిల్లవాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


End of Article

You may also like