పెళ్లి కార్డులో ఇలాంటి వివరాలు కూడా పెడతారా..? ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

పెళ్లి కార్డులో ఇలాంటి వివరాలు కూడా పెడతారా..? ఈ వెడ్డింగ్ కార్డ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Mounika Singaluri

Ads

ఇంట్లో పెళ్లి సందడి మొదలవుతుందంటే.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అందులోనూ ఈ కాలం పిల్లలు అయితే పెళ్లి పందిరి నుంచి పెళ్లి కార్డు, దుస్తులు, పెళ్లి భోజనం అన్ని ఇలా కొత్తగా ఉండాలని అనుకుంటారు.

Video Advertisement

అందరిలా పెళ్లి కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అందులో కొంతమంది డబ్బులు ఖర్చు పెట్టి మరి చాలా డిజైన్స్‌లో ఎక్కువ ధర ఉండే పెళ్లి కార్డులు కొట్టిస్తారు. ఈ పెళ్లి కార్డుల్లో వరుడు, వధువు ఏం చదువుకున్నారు, వాళ్ల ఉద్యోగం వివరాలు రాస్తుంటారు.

కానీ ఇటీవల ఓ పెళ్లి కార్డులో వరుడు, వధువు పేరు పక్కన ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ అనే రాశారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమ మాత్రమేనని, మహేశ్ అనే వ్యక్తి ఈ పోస్ట్‌ షేర్ చేశాడు. దీంతో కొందరు నెటిజన్లు ఇలా కామెంట్లు చేస్తున్నారు. మీ జీతాలు, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌ కూడా రాయాలని మరికొందరు నెటిజన్లు అడుగుతున్నారు. ఇంకొందరైతే అయ్యే.. ర్యాంక్ రాయలేదే అని కూడా వెటకారంగా కామెంట్లు చేస్తున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.


End of Article

You may also like