ఎన్టీఆర్ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

ఎన్టీఆర్ దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Harika

Ads

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా దేవర. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ డబల్ యాక్షన్ చేస్తారు అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Video Advertisement

జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇది జాన్వీ కపూర్ మొదటి తెలుగు సినిమా. సినిమాలో జాన్వీ కపూర్ గెటప్ కూడా ఇప్పటికే విడుదల చేశారు. చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పేరు శృతి మరాఠే. శృతి ఒక మరాఠీ నటి.

devara movie second heroine

శృతి ఎన్నో నాటకాల్లో, సీరియల్స్ లో, సినిమాల్లో నటించారు. అందులో కొన్ని హిందీ, మరాఠీ, తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఒకవేళ శృతి ఇందులో నటిస్తున్నారు వార్త నిజం అయితే, ఇది శృతి మొదటి తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాలో ఒక సహాయ పాత్రలో శృతి నటిస్తున్నారు. దీని గురించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. కానీ శృతి మాత్రం ఇప్పటికే దేవర సినిమాలో ఒక షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్త వచ్చింది.

devara movie second heroine

దేవర సినిమా కాస్టింగ్ ఎంపిక మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇప్పటి వరకు తెలుగులో తక్కువగా చూసిన నటులని సినిమాలు తీసుకుంటున్నారు.  ఎందుకంటే, ఈ సినిమా పాన్-ఇండియన్ సినిమా. కాబట్టి ఇందులో నటించే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయిన వారు ఉండాలి. దీని వల్ల సినిమాకి మార్కెటింగ్ జరుగుతుంది. ఒక రకంగా ఇది సినిమాకి ప్రమోషన్ కూడా అవుతుంది. అందుకే సినిమా బృందం ఒక్కొక్క భాష నుండి ఒక్కొక్క నటులని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. మొదటి భాగం అయితే ఈ సంవత్సరం విడుదల అవుతుంది. తేదీ ఎప్పుడు అనేది ప్రకటించాల్సి ఉంది.

ALSO READ : శ్రీలీలతో ఉన్న ఈ బాబు ఏ హీరోయిన్ కొడుకో తెలుసా..?


End of Article

You may also like