ధనుష్ మూవీ లో సపోర్టింగ్ రోల్ తో డెబ్యూ.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా సినిమా రిలీజ్ చేసి హిట్.! ఎవరంటే.?

ధనుష్ మూవీ లో సపోర్టింగ్ రోల్ తో డెబ్యూ.. ఇప్పుడు ధనుష్ కి పోటీగా సినిమా రిలీజ్ చేసి హిట్.! ఎవరంటే.?

by Mounika Singaluri

Ads

ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతూ సినిమాలు మీద సినిమాలు చేస్తున్న నటుడు ధనుష్ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. కెప్టెన్ మిల్లర్ సినిమా తమిళంలో భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకుంది కానీ తెలుగులో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్ట లేకపోయింది. ఇక హీరో శివ కార్తికేయన్ విషయానికి వస్తే అతను తమిళంలో ఎంత మార్కెట్ ని సంపాదించుకున్నాడో..

Video Advertisement

తెలుగులో కూడా అంతే మార్కెట్ సంపాదించుకొని బిజీగా ఉన్నాడు. మొన్న సంక్రాంతికి ధనుష్ సినిమా కెప్టెన్ మిల్లర్ తో పాటు శివ కార్తికేయం సినిమా ఆయలాన్ కూడా విడుదలైంది. ఇప్పుడు వీరిద్దరి కంపేరిజన్ ఎందుకు అని అడిగితే.. ఇక్కడ మేటర్ కంపారిజన్ గురించి కాదు శివ కార్తికేయన్ కెరియర్ జర్నీ గురించి. నిజానికి శివ కార్తికేయన్ ధనుష్ హీరోగా తెరకెక్కిన త్రీ సినిమాలో ఆయనకు స్నేహితుని పాత్రలో నటించాడు.

ఆ తర్వాత విభిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుని తమిళంలో సక్సెస్ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. పక్కింటి కుర్రాడు తరహా పాత్రలలో ఎక్కువగా నటించడం వల్ల శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్, అయలాన్ రెండు సినిమాలు పోటాపోటీగా సంక్రాంతి బరిలో దిగినప్పటికీ విజయం మాత్రం శివ కార్తికేయన్ కె దక్కింది.

అయలాన్ మూవీ తమిళంలో 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సింది కానీ అనివార్య కారణాల వలన విడుదల కాలేదు. ఒకవేళ విడుదలై ఉంటే మాత్రం కలెక్షన్స్ మరింత పెరిగేవి అని చాలామంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. శివ కార్తికేయన్ సక్సెస్ఫుల్ జర్నీని అప్రిషియేట్ చేస్తున్నారు.


End of Article

You may also like