Ads
- చిత్రం : సార్
- నటీనటులు : ధనుష్, సంయుక్త, సముద్రఖని.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
- దర్శకత్వం : వెంకీ అట్లూరి
- సంగీతం : జీవి ప్రకాష్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 17, 2023
Video Advertisement
స్టోరీ :
బాలగంగాధర్ తిలక్ అలియాస్ బాలు (ధనుష్), త్రిపాఠి కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ కాలేజ్ చైర్మన్ అయిన శ్రీనివాస్ త్రిపాఠి (సముద్రఖని) ప్రభుత్వ కాలేజ్ లకి సహాయం చేస్తున్నాను అని చెబుతూనే తన విద్యాసంస్థలు ఎదగాలి అని అక్కడ పనిచేసే కొంత మంది లెక్చరర్లని ప్రభుత్వ కాలేజీల్లో ఉచితంగా విద్య చెప్పించడానికి పంపిస్తాను అని చెప్తాడు. ఇందులో బాలు కడప జిల్లాలోని సిరిపురం గ్రామానికి లెక్చరర్ గా వెళ్తాడు. బాలుకి మీనాక్షి (సంయుక్త) అనే లెక్చరర్ తో పరిచయం ఏర్పడుతుంది.
మిగిలిన కాలేజీల్లో చదివే పిల్లల కంటే తన కాలేజీలో చదివే పిల్లలకు ఎక్కువ మార్కులు రావాలి అని త్రిపాఠి అనుకుంటాడు. కానీ బాలు మాత్రం తాను విద్య చెప్పే పిల్లలు అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనుకుంటాడు. కొన్ని కారణాల వల్ల సిరిపురం ప్రెసిడెంట్ (సాయి కుమార్) బాలుని ఊరి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. అప్పుడు బాలు ఏం చేశాడు? అక్కడ ఉన్న విద్యార్థులకి చదువు ఎలా చెప్పాడు? బాలు ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? త్రిపాఠి ప్లాన్ ని బాలు బయటపెట్టాడా? బాలు విద్య చెప్పిన విద్యార్థులు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారా? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ధనుష్ డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయకపోయినా కూడా ధనుష్ కి తెలుగులో చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ధనుష్ హీరోగా నటించిన తమిళ్ సినిమాలు అన్నీ కూడా తెలుగులో విడుదల అవుతున్నాయి. రఘువరన్ బీటెక్ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గర అయ్యారు ధనుష్. ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా కాన్సెప్ట్ సింపుల్ గా ఉన్నా కూడా తెరపై చాలా ఎమోషనల్ గా కనిపిస్తుంది.
నిజంగా 90 ల్లో, అది కూడా ఊళ్ళలో చదువు లాంటి కనీస అవసరం దొరకడం ఎంత కష్టం అనేది ఈ సినిమాలో చూపించారు. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ధనుష్ బాలు అనే పాత్రకి సరిగ్గా సూట్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత ఆ పాత్రలో ధనుష్ ని తప్ప ఇంకొకళ్ళని ఊహించుకోవడం కష్టం. మిగిలిన నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.
ధనుష్ తర్వాత సినిమాకి మరొక హీరో మాత్రం జీవి ప్రకాష్. పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి హైలైట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి ఇంకొక ప్లస్ అయ్యింది. కానీ సినిమా చూశాక ప్రేక్షకులకు గుర్తుండిపోయేది మాత్రం అందులో డైలాగ్స్. సినిమాలో వచ్చే చాలా డైలాగ్స్ ఎమోషనల్ గా అనిపిస్తాయి.
సినిమా ఫస్ట్ హాఫ్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అక్కడక్కడ హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమా గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్ లో సినిమా కథ మొత్తం చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. కానీ ముందు మాత్రం కొన్ని సీన్స్ అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే అన్ని రకాలుగా బాగుంది అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
- ధనుష్
- మ్యూజిక్
- నిర్మాణ విలువలు
- డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
- సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్:
సినిమాలో స్టార్ నటీనటులు ఉన్నా కూడా అంతకంటే గొప్ప కథ కూడా ఉంది. ఇటీవల కాలంలో ఎన్నో సందేశాత్మక సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని మాత్రం ప్రేక్షకులకి గుర్తుండిపోయేలాగా ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఏ వయసు వర్గానికి చెందిన వారు అయినా సరే తప్పకుండా చూడాలి అని అనిపించేలాగా ఉంటాయి. ఆ సినిమాల్లో సార్ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.
watch trailer :
End of Article