Home Movie Reviews ధనుష్ “సార్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

ధనుష్ “సార్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Mohana Priya

ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా వాతి. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందించారు. ఈ సినిమాకి తెలుగులో సార్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. హీరోయిన్ సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ధనుష్ కి తెలుగులో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

అందుకే ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషల్లో ఒకటేసారి రూపొందించి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఒక మంచి సందేశాత్మక చిత్రం అని అర్థం అవుతోంది. చదువుకి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ సినిమాలో అంశంగా ఎంచుకొని దానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని తీసుకొచ్చారు.

umair sandhu review about sir movie..!!

ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ప్రేక్షకులకి ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమా ఫైనల్ కట్ కూడా చాలా బాగుంది అని ఇప్పటికే టాక్ వచ్చేసింది. ఈ సినిమా కొద్దిరో జుల్లో విడుదల అవ్వబోతోంది. ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా రివ్యూ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ విధంగా రాశారు. “వాతి ఒక మంచి సందేశం ఉన్న ప్రయోగాత్మక సినిమా. ధనుష్ భారతదేశంలో అన్ని రకాల పాత్రలు పోషించగల నటుల్లో ఒకరు. సినిమా మొత్తం ఆయన హైలైట్ గా నిలిచారు.”

dhanush vaathi censor review by umair sandhu

“క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. సినిమా తప్పకుండా చూడండి” అని రాశారు. అలాగే సినిమాకి 3.5 రేటింగ్ కూడా ఇచ్చారు. ఓవర్సీస్ క్రిటిక్ అయిన ఉమైర్ సంధు ప్రతి సినిమాకి మొదటిగా రివ్యూ ఇస్తారు. చాలా తెలుగు సినిమాలకి కూడా అంతకుముందు ఇలాగే రివ్యూ ఇచ్చారు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకి అందరికంటే ముందు రివ్యూ ఇస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అలాగే ఇచ్చారు.

dhanush vaathi censor review by umair sandhu

ఈ రివ్యూ చూసిన నెటిజన్లు అందరూ కూడా అంతకుముందు ధనుష్ హీరోగా నటించిన తిరుచిత్రాంబలం సినిమాకి ఇచ్చిన రివ్యూని చూపిస్తూ, “ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. కాబట్టి ఈ సినిమాకి ఇచ్చిన రివ్యూ కూడా కచ్చితంగా నిజం అయ్యి ఉంటుంది” అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రివ్యూలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.

You may also like