ధోని అభిమాని పంపిన మెసేజ్ ఇది..! చూస్తే నిజమే కదా అనిపిస్తుంది!!!

ధోని అభిమాని పంపిన మెసేజ్ ఇది..! చూస్తే నిజమే కదా అనిపిస్తుంది!!!

by Megha Varna

Ads

ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది. టీమిండియా పరాజయం పాలై సిరీస్‌ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. దీంతో కివీస్ సిరీస్ సొంతం చేసుకుంది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా, నవదీప్ సైనీ గెలుపుపై ఆశలు రేపినా చివరి వరకూ ఆ జోరును కొనసాగించలేకపోయారు.

Video Advertisement

భారత ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్‌ అయ్యర్‌ 52, నవదీప్‌ సైనీ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో బెన్నెట్‌, సౌదీ, జేమిసన్‌, కొలిన్‌ డి ఇంగ్రామ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. దానికి ముందు బాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్లు గప్తిల్, నికోలస్ 93 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభాన్ని అందించారు.కివీస్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ 73 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్‌కు 2 వికెట్లు, చాహల్‌కు 3 వికెట్లు, జడేజాకు ఒక వికెట్ దక్కింది.

ఇది ఇలా ఉండగా ఈ సమయంలో భారత జట్టు ఓటమికి గురయ్యాక ధోని అభిమానుల్లో ఒకరు మాకు ఇలా మెసేజ్ చేసారు..భారత అభిమానులు మాత్రం ఈ సమయంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ని గుర్తుతెచ్చుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సార్లు మ్యాచ్ ఫినిష్ చేసి విజయాన్ని అందించాడు ధోని. వరల్డ్ కప్ లో కూడా చివరి వరకు పోరాడాడు. అతను ఉన్నంత సేపు అందరికి వరల్డ్ కప్ పై ఆశలు ఉండే. ఆ ఒక్కడు అంత ఇంపాక్ట్ సృష్టించాడు. ఎంతమంది అవుట్ అయినా ధోని ఉన్నాడులే అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వీళ్ళు టీం ని గెలిపిస్తారులే అన్న నమ్మకం ఎవరిపైన పెట్టుకోలేకపోతున్నాము.


End of Article

You may also like