సుదీర్ఘ కాలం క్రికెట్‌లో తన బ్యాటింగ్‌, కీపింగ్‌లతో అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని.. ఇటీవల కాలంలో రోజుకో వేషంతో మనకు దర్శనమిస్తున్నాడు. మొన్న రైతుగా మారాడు…నిన్న పిచ్‌ను చదును చేసిన పనిలో పడ్డాడు. ఆ వీడియోలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

రైతుగా వ్యవసాయం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు ధోని. తన పొలంల్లో బొప్పాయి, పుచ్చకాయ పంటలను పండించేందుకు సిద్ధం అవుతున్నాడు. సేంద్రియ పద్దతిలో ఈపంటను పండించబోతున్నట్టు ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. కొబ్బరికాయ కొట్టి విత్తనాలు వేయబోతున్నట్టు తెలిపారు. ధోని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇది ఇలా ఉంటె..రాంచీలోని జేఎస్‌సీఏ క్రికెట్‌ స్టేడియంలో తరచు ప్రాక్టీస్‌ చేసే ధోని.. తాజాగా పిచ్‌ రోలర్‌ డ్రైవర్‌ అవతారమెత్తాడు. పిచ్‌ను ఎలా చదును చేయాలో తెలుసుకున్న ధోని, తనకు అవకాశం దొరికిందే తడవుగా రోలర్‌ ఎక్కేసి పిచ్‌ను దున్నేశాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

watch video:

watch video: