ధోనికి వయసైపోతుందంటూ ఆ ఫోటోపై వచ్చిన కామెంట్స్ కి… తన తల్లి రియాక్షన్ ఇదే!

ధోనికి వయసైపోతుందంటూ ఆ ఫోటోపై వచ్చిన కామెంట్స్ కి… తన తల్లి రియాక్షన్ ఇదే!

by Megha Varna

Ads

భారత్ క్రికెట్ జట్టుకు వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ మరియు టి 20 వరల్డ్ కప్ సాధించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ..ఇతనిని అందరు మిస్టర్ కూల్ అని కూడా అభివర్ణిస్తారు.ఎంతటి ఒత్తిడి ఉన్న పరిస్థితులలో అయినా సరే కూల్ గా జట్టును ముందుకు నడిపించగల సామర్థ్యం ఉన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.అయితే అతను 10 సంవత్సరాల క్రితం లాంగ్ హెయిర్ తో ఉండేవారు.అప్పుడు అందరు జార్ఖండ్ జులపాల వీరుడు అని పిలిచేవారు.2011 ప్రపంచ కప్ విజయం తరువాత గుండు చేయించుకోవడం వలన క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసాడు ధోని.

Video Advertisement

తరువాత మళ్ళీ మాములుగా జుట్టు పెంచుకొని తరువాత 2019 ప్రపంచ కప్ ముందు మళ్ళీ గుండుతో కనిపించదు.అయితే తాజాగా అతని గెడ్డం స్టైల్ ను మార్చాడు.కాగా అతని గెడ్డం తెలుపు మరియు బూడిద రంగు మిశ్రమం లాగా కనిపిస్తుంది.ఇలా గడ్డంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అయ్యి అంతటా ఈ విషయంపై చర్చ నెలకొంది. ధోని బాగా ఓల్డ్ అయిపోయాడని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.కాగా దీనిపై ధోని తల్లి స్పందిస్తూ ..చాలామంది నా కొడుకు ఓల్డ్ అయిపోయాడని అంటున్నారు కానీ అది ఎంతమాత్రం నిజం కాదు.నేను కూడా అతని న్యూ లూక్ చూసాను .ఎప్పుడూ కూడా తల్లికి తన కొడుకు ఓల్డ్ గా  కనిపించరు అని తెలిపారు.

దేశీయ క్రికెట్లో కూడా ధోని లేకపోవడంతో తన పదివి విరమణపై పలువురు ప్రశ్నిస్తున్నారు.90 టెస్టులు , 350 వన్డేలలో భారత్ కు కెప్టెన్ గా చేసిన ధోని ,ఐపీఎల్ 13 వ సీజన్లో తిరిగి రానున్నాడు.కానీ కరోనా వైరస్ కారణంగా ఐపీల్ సీజన్ ను మరికొంత కాలం వాయిదా వెయ్యాలని బీసీసీఐ తెలిపింది.ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో జరిగి వరల్డ్ కప్ లో ధోని స్తానం సంపాదిస్తారా  లేదా అనే విషయం ఐపీల్ లో ధోని చూపించే పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది.కానీ ఇప్పుడు ఐపీఎల్ కూడా చాలా కాలం వాయిదా పడేలా కనిపిస్తుంది.కాగా ఏమి జరుగుతుందో వేచి చూడాలి.


End of Article

You may also like