అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు …పిల్లలకు పేర్లు పెట్టిన హీరో…!

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు …పిల్లలకు పేర్లు పెట్టిన హీరో…!

by Sainath Gopi

Ads

అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఇది భారతీయులు అందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ఈ వేడుక రోజున దేశమంతా రామనామ స్మరణతో మోగిపోయింది. అయితే ఇటువంటి పవిత్రమైన రోజును చాలామంది తమ జీవితంలో ముఖ్యమైన రోజుగా మార్చుకోవాలని కొన్ని పనులు చేశారు.

Video Advertisement

అయితే ఒక హీరో ఏకంగా ఈ రోజు తమ పిల్లలకు పేర్లు పెట్టుకున్నాడు.శాండల్ వుడ్ హీరో ధ్రువ్ సర్జా, ప్రేరణ దంపతుల పిల్లవాడికి నిన్న నామకరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ హీరో అర్జున్ మేనల్లుడుగా సర్జా అందరికీ పరిచయమే. ఈ నామకరణం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు సంజయ్ దత్, అర్జున్ కూడా పాల్గొన్నారు. స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడైన ధ్రువ్ తన పిల్లలకు ఏం పేరు పెట్టాలో అని తెలియక ఇన్నాళ్లు వేచి చూశాడు.

అయోధ్య రామ మందిరం రోజు నాడు పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుని అదే రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. తన కూతురికి రుద్రాక్షి అని, తన కొడుకుకి హయగ్రీవ అని పేరు పెట్టారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఐదు ముఖాలలో ఒక ముఖానికి హయగ్రీవ పేరు ఉంటుంది. వాటి నుండి తీసుకునే తమ పిల్లాడికి పేరు పెట్టినట్లుగా చెప్పాడు. దీనిపై నేను మాట్లాడుతూ అయోధ్యలో పూజలో జరిగే సమయంలోనే తమ పిల్లలకు పేర్లు పెట్టామని చెప్పాడు. త్వరలోనే కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తామని తెలియజేశాడు. పరమశివ భక్తుడు అయిన సంజయ్ దత్ తమ కుమార్తెకు రుద్రాక్షి అని పేరు పెట్టడంతో ఎంతగానో సంతోషించారని తెలియజేశారు.
తమ పిల్లలకు సాంప్రదాయ బద్దమైన పేర్లు పెట్టడంతో ధ్రువ్ సర్జా దంపతులను పలువురు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు.


End of Article

You may also like