వైయస్ భారతి చేసిన దాంట్లో తప్పు ఏముంది..? నిజం తెలుసుకోకుండా ఎందుకు కామెంట్ చేస్తున్నారు..?

వైయస్ భారతి చేసిన దాంట్లో తప్పు ఏముంది..? నిజం తెలుసుకోకుండా ఎందుకు కామెంట్ చేస్తున్నారు..?

by kavitha

ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా షర్మిల ఎంగేజ్మెంట్ కు హాజరైన తన అన్న సీఎం జగన్, వదిన భారతిలను పట్టించుకోలేదనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

అన్న జగన్ పట్టించుకోని, షర్మిల జగన్ రాజకీయ ప్రత్యర్ధి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం చెప్పడం, ఆదరించిన తీరుతో ఇద్దరి మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయని అంటున్నారు. ఇది ఇలా ఉంటే సంక్రాంతి సంబరాల నేపథ్యంలో సీఎం జగన్, భారతి పూజలు చేయగా, భారతి పూజారులు ఇచ్చిన తీర్థ ప్రసాదాలను  అవమానపరిచిందంటూ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు ఆఫీస్ లో సంక్రాంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. సీఎం జగన్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఇద్దరు తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా సీఎం జగన్ పంచెకట్టుతో, భుజంమీద కండువాతో కనిపించారు. తన సతీమణి భారతితో కలిసి పూజలు చేశారు.  గోమాతకు పూజ కూడా చేశారు. ఆ తరువాత భోగి మంటను వెలిగించారు. అయితే పూజలు పూర్తయిన తరువాత పూజారులు ఇచ్చిన తీర్ధ, ప్రసాదాలు ఇచ్చారు.
అయితే కొందరు వైఎస్ భారతి తీర్థాన్ని ఒంపేసిందని, ప్రసాదాన్ని పొట్లం కట్టిందంటూ విమర్శిస్తూ కొందరు వీడియోలను వైరల్ చేస్తున్నారు. అయితే ఆమెకు తీర్ధం ఇవ్వగా, తీసుకుంది. ఆ తరువాత తల పై రాసుకుంది. ఇలా అందరు సాధారణంగా చేస్తారు.
తీర్థాన్నికిందపడానివ్వకుండా తలకు రాసుకోవడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. ఆ విధంగానే ఆమె చేసింది. ఇక ప్రసాదాన్ని తీసుకున్న తరువాత పక్కన ఉన్నావారెవరో టిష్యూ ఇవ్వగా, దానితో తన చేతిని తుడుచుకుంది. ప్రసాదాన్ని పొట్లం కట్టడం కానీ పడేయడం కానీ చేయలేదు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారం అని అంటున్నారు.

watch video : 

Also Read: రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్‌లో షర్మిల తన అన్నని పట్టించుకోలేదా..? విభేదాలు నిజమేనా..?

 


You may also like

Leave a Comment