Home Filmy Adda Rakul Preet Singh : రకుల్ ముఖంలో మార్పుకి కారణం సర్జరీనా.? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.!

Rakul Preet Singh : రకుల్ ముఖంలో మార్పుకి కారణం సర్జరీనా.? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.!

by Mohana Priya

Ads

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కేవలం తెలుగు మాత్రమే కాకుండా, తమిళం, హిందీ భాషల్లో కూడా రకుల్ సినిమాలు చేస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ G అనే సినిమాతో పాటు, అజయ్ దేవగన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అని మనందరికీ తెలుసు.

Video Advertisement

rakul 2

రకుల్ తరచుగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. గత 2 సంవత్సరాల నుండి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. బరువు తగ్గిపోయి బక్కగా అయిపోయారు. కొంత కాలం ట్రోలింగ్ కి కూడా గురయ్యారు. ఒక సందర్భంలో తన హిందీ సినిమా దే దే ప్యార్ దే కోసం ఇలా సన్నబడి నట్లు చెప్పారు. ఇది 2 సంవత్సరాల క్రితం విషయం. రకుల్ ఇప్పుడు కూడా అలాగే సన్నగా ఉన్నారు. అయితే రకుల్ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు.

అందులో రకుల్ ముఖం చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సాక్షి కథనం ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో చాలా మంది నెటిజన్లు రకుల్ పాత ఫోటోలని, ఇప్పటి ఫోటోలని పోల్చి, “ఏంటి రకుల్? ఇలా అయిపోయారు?” అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ హీరోయిన్ గా నటించిన కొండ పొలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.


End of Article

You may also like