ఈ ఫోటోలో చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో…. ఎవరో గుర్తు పట్టారా..?

ఈ ఫోటోలో చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో…. ఎవరో గుర్తు పట్టారా..?

by Megha Varna

Ads

నటీ నటులు చిన్ననాటి ఫోటోలు కనుక సోషల్ మీడియాలోకి వచ్చాయి అంటే ఫ్యాన్స్ తెగ సందడి చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫోటోని ఆనందంతో విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటో లో క్యూట్ గా నవ్వుతూ కనబడుతున్న ఈ చిన్నోడు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కింగ్. ఈ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఏ వేరే లెవెల్.

Video Advertisement

మరి ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా..? ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవరో కాదండి యావత్ భారత చలన చిత్ర రంగంలో అద్భుతమైన క్రేజ్ ని పొందిన రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకొని అభిమానులకు బాగా దగ్గరయ్యాడు.

2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పొందాడు. అటు మాస్ ఇటు క్లాస్ రెండు వర్గాల వారికి కూడా బాగా దగ్గర అయిపోయాడు. ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like