“ఎవడు” సినిమాలో ఈ సీన్ ఎప్పుడైనా గమనించారా? పాపం రామ్ చరణ్ స్క్రీన్ చూసి షాక్ అయ్యుంటాడు.!

“ఎవడు” సినిమాలో ఈ సీన్ ఎప్పుడైనా గమనించారా? పాపం రామ్ చరణ్ స్క్రీన్ చూసి షాక్ అయ్యుంటాడు.!

by Mohana Priya

Ads

చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లు సాధారణ వ్యక్తుల పాత్రలను పోషిస్తారు. సాధారణంగా అందరం సినిమాల గురించి మాట్లాడుకుంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి, సినిమాల్లో కూడా హీరో హీరోయిన్ మామూలు వ్యక్తుల లాగానే సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు. ముందు సినిమాల గురించి మాట్లాడడం ఏంటో చూద్దాం. ఇది రెండు రకాలుగా మాట్లాడతారు. ఒక దాంట్లో వేరే సినిమాల రిఫరెన్స్ ఉంటుంది. ఇంకొక దాంట్లో వాళ్ళ సినిమాల రిఫరెన్స్ ఉంటుంది.

Video Advertisement

వేరే సినిమాల రిఫరెన్స్ కి ఒక ఉదాహరణ ఏంటంటే అత్తారింటికి దారేది సినిమాలో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ డ్రైవర్ గా వెళ్తారు. ఇక్కడ డ్రైవర్స్ ఎలా ఉంటారో తెలుసుకోవడానికి కొన్ని సినిమాలు చూస్తారు. అందులో ఒకటి గ్యాంగ్ లీడర్ సినిమా. గ్యాంగ్ లీడర్ సినిమా లో చిరంజీవి, విజయ శాంతి తో మాట్లాడే సీన్ చూసి “ఎవరు ఈయన చాలా బాగా చేస్తున్నారు?” అని ఎంఎస్ నారాయణ గారిని అడుగుతారు పవన్ కళ్యాణ్. ఇది వేరే సినిమాల రిఫరెన్స్ తీసుకోవడం.

ఇప్పుడు వాళ్ల సినిమాల గురించి వాళ్లే మాట్లాడటానికి ఒక ఉదాహరణ ఏంటంటే నిన్ను కోరి సినిమా లో నాని, మురళి శర్మ బైక్ మీద వెళ్తున్నప్పుడు నాని తను అమ్మాయిల వెంట పడే మజ్ను టైప్ కాదు అని పక్కా జెంటిల్ మాన్ అని చెప్తారు. మజ్ను, జెంటిల్ మాన్ రెండు నాని సినిమాలే. అలాగే ఖలేజా సినిమాలో మహేష్ బాబు పోకిరి సినిమాలో పాపులర్ అయిన డైలాగ్ “ఎవడు కొడితే దిమ్మ తిరిగి” డైలాగ్ ని కొంచెం మార్చి చెప్తారు. వాళ్ల సినిమాల రిఫరెన్స్ వాళ్లు వాడడం అంటే ఇలా అన్నమాట.

ఇవి కేవలం ఉదాహరణకి చెప్పినవి మాత్రమే. ఇలాంటివి చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. అయితే రెండవది సినిమాలు చూడటం. చాలా సినిమాల్లో ఆ హీరో, హీరోయిన్ నటించిన సినిమాలు కాకుండా వేరే సినిమాలు చూస్తారు. వాళ్ళు నటించిన సినిమా వాళ్లే చూడడం అనేది చాలా రేర్ కేసెస్ లో అవుతుంది. ఆ రేర్ కేస్ లో ఉన్న సినిమాలు ఏవంటే.

మొదటిది రేస్ గుర్రం. ఈ సినిమాలో శృతిహాసన్ ఎంట్రీ సీన్ తరువాత ఒక చోట కూర్చుని సినిమా చూస్తూ ఉంటారు. పక్కనే అల్లు అర్జున్ కూడా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూసే సినిమా గబ్బర్ సింగ్. ఆ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్.

అలాగే ఎవడు సినిమాలో కూడా రామ్ చరణ్, శృతిహాసన్, గబ్బర్ సింగ్ సినిమా కి వెళ్తారు. కానీ రేస్ గుర్రం, ఎవడు సినిమాల్లో వాళ్ళు గబ్బర్ సింగ్ సినిమా చూస్తున్నప్పుడు శృతి హాసన్ సీన్స్ కాకుండా ఆ సినిమాలోని వేరే సీన్స్ ప్లే అవుతాయి.

ఇవి మాత్రమే కాదు. అల వైకుంఠ పురం లో సినిమాలో బోర్డ్ రూమ్ సీన్ లో అల్లు అర్జున్ అందరి హీరోల పాటలకి డాన్స్ చేస్తారు. అందులో సినిమా చూపిస్త మామ పాట కూడా ఉంటుంది. ఆ పాట రేస్ గుర్రం సినిమా లోది. రేసుగుర్రం లో హీరో అల్లు అర్జున్. శృతి హాసన్, అల్లు అర్జున్ మాత్రమే కాకుండా ఇంకొంత మంది నటులు కూడా ఈ జాబితాలో ఉండొచ్చు.


End of Article

You may also like