Home Filmy Adda మెగాస్టార్ “మాస్టర్” ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఈ తప్పు ఎప్పుడైనా గమనించారా.?

మెగాస్టార్ “మాస్టర్” ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఈ తప్పు ఎప్పుడైనా గమనించారా.?

by Mohana Priya

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. వాటిని మనం సినిమా విడుదలైనప్పుడు అంత పట్టించుకోము కానీ, ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమా చూసినప్పుడు “అరే ఇది పొరపాటు కదా” అని అనిపిస్తుంది. అలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది.

chiranjeevi master movie mistake

సినిమా వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, కానీ పైన చెప్పినట్టుగా ఎప్పుడైనా అంటే అది ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ మళ్లీ సినిమా చూసినప్పుడు మాత్రమే ఇలాంటివి గమనిస్తాం. ఇంక విషయానికి వస్తే, ఈ సినిమాలో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో రోషిని ని ఇష్టపడతారు. అయితే రోషిని చిరంజీవి గురువైన విజయ్ కుమార్ గారి కూతురు.

chiranjeevi master movie mistake

ఒక సందర్భంలో విజయ్ కుమార్ గారితో మాట్లాడుతున్న చిరంజీవి, రోషిని విజయ్ కుమార్ కలిసి ఉన్న ఫోటోలను చూస్తారు. ఈ రెండు ఫోటోల్లో విజయ్ కుమార్ గారు ఇంకా రోషిని ఆ పర్టిక్యులర్ సీన్ లో ఎలా అయితే ఉన్నారో ఫోటోల్లో కూడా అలాగే ఉంటారు. దాన్ని బట్టి ఆ ఫోటోలు అప్పుడే తీసినవి అని అర్థమైపోతాయి.

chiranjeevi master movie mistake

మనం ఇలా చూస్తే ఈ పొరపాట్లు జాబితాలో చాలా సినిమాలు ఉంటాయి. ఏ సినిమా అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అసలు వీటికి పొరపాటు అనేది కూడా చాలా పెద్ద పదం ఏమో. కాబట్టి వీటివల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి ప్రేక్షకులు కూడా వీటిని అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు అరే ఇది పొరపాటు ఏమో కదా అని అనిపిస్తుంది అంతే.

You may also like