సలార్ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

సలార్ మూవీలో ఈ మిస్టేక్ గమనించారా..? చూసుకోవాలి కదా డైరెక్టర్ గారూ..?

by kavitha

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటించారు.

Video Advertisement

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సీన్స్ కి థియేటర్లలో మంచి స్పందన వస్తోంది. ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నెట్టింట్లో ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది. తాజాగా ఈ మూవీలోని ఓ మిస్టేక్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే కొందరు కేజీఎఫ్ స్థాయిలో సెన్సేషనల్ టాక్ తెచ్చుకోలేక పోయిందని విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం సలార్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ తొలిసారిగా జంటగా నటించారు.
జర్నలిస్ట్ ఆద్య క్యారెక్టర్ లో శృతి హాసన్ నటించింది. ఈ మూవీలో కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా ఇతర పాత్రలలో జగపతి బాబు, ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, బాబీ సింహా నటించారు. ఈ మూవీలో బాబీ సింహా శౌర్యాంగ గిరిజనుడు అయిన భార‌వ‌గా నటించారు.
ఖాన్సార్‌లోని దొర‌లలో ఒకరైన రాజ మన్నార్ అల్లుడు, రాధా రామకు భర్తగా నటించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో బాబీ సింహా చేతిలో ఐఫోన్ ఎక్స్ మోడల్ ఉంటుంది. అయితే ఈ సీన్ 2010 లో జరుగుతుంది. అప్పటికి ఇంకా ఐఫోన్ ఎక్స్ మోడల్ రాలేదు. కొత్త మోడల్ ఐఫోన్ ఎలా ఉపయోగిస్తారు. ఇలాంటి మిస్టేక్స్ చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Btech_ratnaalu (@btech_ratnaalu)

Also Read: సలార్ సినిమా మీద ఈ నెటిజన్ కామెంట్ చూశారా..? ఏం అన్నారంటే..?


You may also like

Leave a Comment