Ads
ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Video Advertisement
ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి.
అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు. ఇటీవల ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. రాధే శ్యామ్ సినిమాలో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే అంతకుముందు విడుదల చేసిన రాధే శ్యామ్ ట్రైలర్, లేదా సినిమాకి సంబంధించిన వేరే వీడియోల్లో కనిపించని కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. అయితే ట్రైలర్‌లో ఒక సీన్ చూపిస్తారు.
అందులో ఒక చెయ్యి చూపిస్తారు. సరిగ్గా గమనిస్తే ఆ చెయ్యి అంతకుముందు ఒక సారి వేరే విధంగా చూపించారు. అంటే ఆ చేతి గీతలని అంతకు ముందు సినిమా టీమ్ విడుదల చేసిన వీడియోలో ట్రైన్ దారిలాగా చూపించారు. పైన ఉన్న ఫోటో చూడండి. ఆ రైలు వెళ్ళే దారి ఆ చేతి గీతలలాగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే అది హీరోయిన్ చెయ్యి అని అర్దం అవుతుంది. హీరోయిన్ భవిష్యత్తుని కూడా హీరో ముందే కనిపెడతాడు. హీరోయిన్ వల్ల హీరో జీవితం కూడా మారుతుంది. హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. అందుకే హీరోయిన్ చెయ్యి మనకి చాలా సార్లు చూపిస్తున్నారు.
https://twitter.com/100rupeees/status/1498956125185601536
End of Article