తాజాగా వైరల్ అవుతున్న “అల్లు అర్జున్” ఫొటోల్లో ఈ విషయం గమనించారా?

తాజాగా వైరల్ అవుతున్న “అల్లు అర్జున్” ఫొటోల్లో ఈ విషయం గమనించారా?

by Mohana Priya

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం ఆదిలాబాద్ లో సందడి చేశారు. తన కుటుంబంతో కలిసి ఆదిలాబాద్ లోని కుంతల జలపాతం సందర్శించారు అల్లు అర్జున్. డిఫరెంట్ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

2020 సంవత్సరం మొదట్లో వచ్చిన అల వైకుంఠపురం సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్, తన తరువాత రాబోయే సినిమా పుష్ప కి సంబంధించిన పనుల్లో ఉన్నారు.

పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ గెటప్ మార్చడం మాత్రమే కాకుండా, చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నారట.

అయితే ఈ చిత్రం షూటింగ్ కేరళలో జరగాల్సి ఉందట. కానీ కరోనా కారణంగా ఇక్కడే షూట్ చేద్దామని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పుడు అల్లు అర్జున్ బయటికి వచ్చింది కూడా పుష్ప సినిమా లొకేషన్స్ కోసమే అట.

ఏదేమైనా అల్లు అర్జున్ న్యూ లుక్ చూసి ప్రేక్షకులకి పుష్ప సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఇంకా పెరిగింది.

ఇంకొక విషయం ఏంటంటే అల్లుఅర్జున్ ధరించిన మాస్క్ మీద AA అని రాసి ఉంది. అలాగే అల్లు అర్జున్ ఇటీవల మేకోవర్ చేయించిన తన రేంజ్ రోవర్ కార్ టైర్ మీద కూడా AA అని రాసి ఉంది.

ప్రస్తుతం ఈ కార్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమాల్లోనే కాకుండా బయట కూడా తనదైన స్టైల్ క్రియేట్ చేస్తూ రియల్ లైఫ్ లో కూడా స్టైలిష్ అనిపించుకుంటున్నారు అల్లు అర్జున్.


End of Article

You may also like