Home Filmy Adda “యాత్ర-2” టీజర్‌లో కనిపించిన ఈ రాజకీయ నాయకులని గుర్తు పట్టారా..? ఆ పాత్రలు పోషించిన నటులు ఎవరంటే..?

“యాత్ర-2” టీజర్‌లో కనిపించిన ఈ రాజకీయ నాయకులని గుర్తు పట్టారా..? ఆ పాత్రలు పోషించిన నటులు ఎవరంటే..?

by Sainath Gopi

2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం యాత్ర 2. ఈ చిత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇక వైయస్సార్ గా మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది.

ఈ టీజర్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు అందరూ కనిపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణ అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు. అదే విషయాలను టీజర్ లో కూడా ఉంచారు.

did you observe these actors in yatra 2 teaser

రాజశేఖర్ రెడ్డి చనిపోవడం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేపట్టడం దాన్ని కాంగ్రెస్ అధిష్టానం వ్యతిరేకించడంతో జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లడం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఎన్నికలకు రావడం ఎలా అన్నీ టీజర్ లో కనబడ్డాయి. టీజర్ లో ఒరిజినల్ రాజకీయ నాయకులను పోలిన నటులను చాలామందిని ఉంచారు. అయితే ఇందులో ముఖ్యంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్రను ఎక్కువగా చూపించారు.

did you observe these actors in yatra 2 teaser

ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ నటించారు. ఇక కీలకమైన సోనియాగాంధీ పాత్రలో హిందీ నటి సుజన్ బెర్నర్ట్ నటించారు. ఇక జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాత్రలు కూడా ఈ టీజర్ లో కనిపించాయి. అలాగే టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాత్ర కూడా ఇందులో ఉంది. ఇక రోశయ్య పాత్ర కూడా ఈ టీజర్ లో కనిపించింది. ఈ టీజర్ అమాంతం సినిమా మీద అంచనాలను పెంచేసింది. రాబోయే రోజుల్లో యాత్ర 2 సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

watch video :

You may also like