దాదాపు 3 నెలలపాటు సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ఇటీవల ముగిసింది. 20 మందితో మొదలైన ఈ ప్రోగ్రామ్‌లో సన్నీ విజేతగా నిలిచారు. ఫినాలే ఎపిసోడ్ సందర్భంగా ఎంతో మంది స్టార్స్ అతిథులుగా వచ్చారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కోసం షోకి వచ్చారు. అలాగే నవీన్ చంద్ర, జగపతి బాబు కూడా వచ్చి హాట్‌స్టార్‌లో రాబోయే వారి వెబ్ సిరీస్ గురించి మాట్లాడారు. డింపుల్ హయాతి, శ్రియా సరన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 3వ రన్నరప్ గా శ్రీ రామ చంద్ర నిలవగా, 2వ రన్నరప్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచారు.
ఇదిలా ఉండగా, ప్రతి ఫైనల్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్స్‌లో ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేస్తారు. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి, నాలుగవ సీజన్ లో అభిజీత్, అఖిల్ సార్థక్, ఇప్పుడు సన్నీ, షన్నుతో కూడా ఇలాగే జరిగింది. ఇద్దరు కంటెస్టెంట్స్ చేతులని పైకి ఎత్తి, విన్నర్ చేతిని అలానే పట్టుకొని, రన్నర్ అయిన కంటెస్టెంట్ చేతిని వదిలేస్తారు.
3వ సీజన్‌లో రాహుల్ చేయి అలాగే పట్టుకొని, శ్రీముఖి చేతిని వదిలినప్పుడు శ్రీముఖి షాక్ అయ్యాడు. గత సీజన్‌లో కూడా అభిజిత్ చేతిని పట్టుకొని, అఖిల్ చేతిని వదిలినప్పుడు నాగార్జున అఖిల్ చేయి కొంచెం వేగంగా వదలడం వల్ల జరిగిన చర్చ గుర్తుండే ఉంటుంది. ఈ సారి ఈ విషయంలో నాగార్జున జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. విన్నర్ అనౌన్స్ సమయంలో సన్నీ చేతిని అలానే పట్టుకున్న నాగార్జున, షణ్ముఖ్ చేతిని మెల్లగా కిందకి విడిచారు. దాంతో విషయం అర్ధం చేసుకున్న షన్ను చప్పట్లు కొట్టారు.
And THE WINNER OF #BiggBossTelugu5 IS #VJSunny🔥🥳🤙
Congrats macha!! YOU TRULY DESERVE IT❤#BBTeluguGrandFinale pic.twitter.com/tyvLOmTZaz— Prats/Anuj Loml Kapadia🥺❤️ (@Pratsxtweets) December 19, 2021