Ads
దాదాపు 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉన్న ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టాక్ మొదట చాలా మిక్స్డ్గా వచ్చింది.
Video Advertisement
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా లేదు అని, సినిమా చాలా స్లోగా ఉంది అని ఇలా చాలా కామెంట్స్ వచ్చాయి. కానీ లవ్ స్టోరీ అంటే సాధరణంగా చాలా స్లోగా ఉంటుంది.
“ఇంత పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ లాంటి హీరో ఇలాంటి సినిమా చేయాలి అనుకోవడం చాలా గొప్ప విషయం. ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి” అని చాలామంది అంటున్నారు. అయితే ఈ సినిమాలో రాధాకృష్ణుల రిఫరెన్స్ ఉంటుంది అని అంతకు ముందు చాలా సార్లు అన్నారు. సినిమా కథ కూడా రాధాకృష్ణుల కథ ఆధారంగానే జరుగుతుంది. అయితే సినిమాలో చివరిలో రాధాకృష్ణుల రిఫరెన్స్ ఉంటుంది.
image source : Instagram (CELLULOID PANDA)
సినిమా చివరిలో పెద్ద ప్రమాదం నుండి ప్రేరణ తప్పించుకుంటుంది. విక్రమాదిత్య హాస్పిటల్ లో ఉన్న ప్రేరణని చూడటం కోసం వెళ్తాడు. అప్పుడు ప్రేరణ వస్తుంది. విక్రమాదిత్య కింద కూర్చొని ఉంటాడు. ప్రేరణ వీల్ చైర్ లో విక్రమాదిత్య దగ్గరికి వస్తుంది. అప్పుడు విక్రమాదిత్య అక్కడికి వచ్చిన ప్రేరణ పాదాన్ని ముట్టుకుంటాడు. ఇది రాధాకృష్ణుల రిఫరెన్స్ తో తీసిన సీన్. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ కూడా రాధే శ్యామ్ అని వినిపిస్తూ ఉంటుంది. సినిమాలో కథ కూడా దాదాపు అలాగే రాధాకృష్ణుల ప్రేమ గురించి ఉంటుంది.
End of Article