Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్ బాబు చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి పాట ఫిబ్రవరి 14న విడుదల అవ్వబోతోంది.
Video Advertisement
ఈ సినిమాకి సోలో, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తి సురేష్‌తో పాటు, వెన్నెల కిషోర్ కూడా కనిపించారు.
అయితే సర్కారు వారి పాట సినిమాలో సినిమాలో మొదటి పాట అయిన “కళావతి” ఇటీవల విడుదల అయ్యింది. ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్ కనిపిస్తున్నారు. ఈ పాటని ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. కళావతి పాటకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేష్ బాబు ఒక యాక్షన్ సీన్ చేస్తూ కనిపిస్తున్నారు.
ఈ పోస్టర్ సడన్ గా చూడంగానే బిజినెస్ మాన్ సినిమాలో ఒక సీన్ గుర్తు వస్తోంది. అందుకు కారణం మహేష్ బాబు కాస్ట్యూమ్. మహేష్ బాబు ఈ పోస్టర్ లో వేసుకున్న షర్ట్ బిజినెస్ మాన్ సినిమాలో మహేష్ బాబు వేసుకున్న ఒక షర్ట్ కి దగ్గరగా ఉంది. దాంతో ఈ పోస్టర్ చూస్తూ ఉంటే బిజినెస్ మాన్ గుర్తొస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంక సినిమా విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా నుండి రెండవ పాట కూడా విడుదల అవుతుంది అని సమాచారం. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
End of Article