SALAAR: సలార్ రిలీజ్ ట్రైలర్ లో ఈ రెండు సీన్స్ గమనించారా.? దీని వెనక అర్ధం అదేనా.?

SALAAR: సలార్ రిలీజ్ ట్రైలర్ లో ఈ రెండు సీన్స్ గమనించారా.? దీని వెనక అర్ధం అదేనా.?

by Mounika Singaluri

Ads

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సలార్ సినిమా సందడే. డిసెంబర్ 22వ తారీఖున విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫస్ట్ ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినది. అయితే సెకండ్ ట్రైలర్ మాత్రం మాస్ ఎలివేషన్స్ తో పూర్తిగా నిండి అభిమానులకు ఫుల్ మీల్స్ అందించింది.

Video Advertisement

అయితే సెకండ్ ట్రైలర్ లో అందరూ ఒక విషయాన్ని గమనిస్తే ఒక వ్యక్తి బ్యాక్ షాట్ ను చూపించారు. అది సేమ్ కేజిఎఫ్ సినిమాలో యాష్ బ్యాక్ షాట్ల అనిపించింది. కేజిఎఫ్ సినిమాలో యాష్ బ్యాక్ షాట్లు చాలానే ఉన్నాయి వాటితో పోలిస్తే సేమ్ ఏ షాట్ కూడా అలానే ఉంది. ఇది చూసి అభిమానులందరూ సలార్ సినిమాలో యష్ ఉన్నాడా కేజీఎఫ్ సినిమాకి ఈ సినిమాకి లింకుందా అంటూ ఆరాల తీస్తున్నారు. అంతే కాదు ఒక బుక్ మీద చెయ్యి పెట్టె సీన్ కూడా ట్రైలర్ లో చూడచ్చు.. ఆ బుక్ కూడా కేజీఎఫ్ లోదేనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాత్రం కేజిఎఫ్ సినిమాతో సలార్ సినిమాకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు.

ఒకవేళ కేజిఎఫ్ తో సలార్ కి సంబంధం లేకపోయినా ఏ విషయమైనా ఇందులో ప్రత్యేక పాత్ర చేస్తున్నాడు అంటూ అనుకుంటున్నారు. ఒకవేళ కేజిఎఫ్ సినిమాకి సలార్ సినిమాకి నిజంగా సంబంధం ఉంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసినట్లే.


End of Article

You may also like