“PSPK-రానా” సినిమా మేకింగ్ వీడియోలో ఈ విషయం గమనించారా..?

“PSPK-రానా” సినిమా మేకింగ్ వీడియోలో ఈ విషయం గమనించారా..?

by Mohana Priya

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్ రూపొందుతోంది అన్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ సినిమా బృందం ఇటీవల విడుదల చేశారు. పోలీస్ గెటప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోని పోస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ సినిమాలో పోషించే పాత్ర పేరు కూడా రివీల్ చేశారు.production no 12 glimpse

Video Advertisement

సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ అనే పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా మేకింగ్ వీడియోని సినిమా బృందం కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ తో పాటు, రానా దగ్గుబాటి కూడా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది అని కూడా చిత్ర బృందం ప్రకటించింది.

did you observed this in pspk rana movie making video

అయితే మీరు ఈ మేకింగ్ వీడియోలో ఒక విషయాన్ని గమనించారా? ఈ సినిమాకి దర్శకుడిగా సాగర్ కే చంద్ర పేరుని ప్రకటించారు. సాధారణంగా అయితే సినిమాలో నటించే వారికి సీన్ వివరించడం అనేది ఒక దర్శకుల బాధ్యత. మనం వేరే ఏ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోలో అయినా సరే ఇదే విషయాన్ని చూస్తాం. ఎంతో మంది డైరెక్టర్లు ఆ సినిమాలో నటించే వాళ్లకి సీన్ వివరించి చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమా మేకింగ్ వీడియోలో మాత్రం అలా లేదు.did you observed this in pspk rana movie making video

సినిమాలో పవన్ కళ్యాణ్ కి, త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్ వివరించి చెప్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం రచయిత. మామూలుగా అయితే ఒక రచయిత పని రాయడం వరకే ఉంటుంది. సినిమా మేకింగ్ లో జోక్యం చేసుకున్నా కానీ ఇంత ఎక్కువగా మాత్రం వారి పాత్ర ఉండదు. కానీ ఇందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లు మనం గమనించవచ్చు. దాంతో “ఈ సినిమాకి దర్శకుడు ఆయన కాదు కదా? మరి సీన్ ఎందుకు వివరిస్తున్నారు?” అని ఈ వీడియోకి కామెంట్స్ వస్తున్నాయి.


End of Article

You may also like