ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప.

10 pushpa

దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు సుకుమార్ ఇప్పటివరకు విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్స్ అలాగే టీజర్ తో చాలా విషయాలను మనకు చెప్పకుండానే చెప్పారు. పైన కనిపిస్తున్న గమనించారా ఇందులో పుష్ప రాజ్ పాత్ర పోషిస్తున్న అల్లు అర్జున్ కూర్చొని ఉన్నారు. వెనకాల పోలీసులు ఉన్నారు.did you observed this point in pushpa poster

ఒకసారి మనం ఇంకా సరిగ్గా గమనిస్తే అల్లు అర్జున్ కాలికి ఆరు వేళ్ళు ఉన్నాయి. అలాగే దాక్కో దాక్కో మేక పాటలో కూడా అల్లు అర్జున్ లుక్ డిఫరెంట్  ఉంది. అంతే కాకుండా అల్లు అర్జున్ ఎడమ భుజాన్ని ఒకరకంగా పెట్టి డాన్స్ వేస్తున్నారు. అది డాన్స్ స్టెప్పా లేదా ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎడమ భుజం అలానే ఉంటుందా. ఇవన్నీ తెలియాలంటే ఇంక సినిమా విడుదయ్యేంత వరకు ఆగాల్సిందే.