Ads
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?టాలీవుడ్ కు సంబంధించి జరిగే చర్చలలో ఎప్పుడూ యాక్టివ్ గా పాల్గొనే మాధవీ లత.ఈమె తెలుగు చిత్రాలలో నటించింది తక్కువే అయిన అందరూ మాట్లాడానికి భయపడే సున్నిత విషయాలలో ధైర్యంగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని తెలుపుతుంది.అందుకే ఈమె తెలుగు వారందరికీ స్ట్రాంగ్ లేడీ స్పీకర్ గా గుర్తుండిపోయింది..
Video Advertisement
ప్రస్తుతం ఈమె సినిమాలకు చాలారోజుల నుండి దూరంగా ఉంటూ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.కరోనా కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన సెలబ్రెటీలు తమ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేయడం కోసం రోజుకొక సరికొత్త ఛాలెంజ్ లతో వస్తున్నారు.తాజాగా మాధవీ లత కూడా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తన టెన్త్ చదువుతున్న రోజులలోని ఫోటోను షేర్ చేశారు.ఇప్పుడు అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఆ ఫోటో పై మీరు ఓ లుక్ వేయండి.
సెలెబ్రెటీలు ఇళ్లకు పరిమితం అవ్వడంతో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండడానికి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు.దానితో కరోనా టైంలో ప్రజలకు ఇది కొద్దిగా ఊరటనిస్తుంది.
End of Article