ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

by Mohana Priya

Ads

బాలీవుడ్ లో నెపోటిజం ఉన్నాకూడా ఎంతో కష్టపడి వైవిధ్యమైన పాత్రల తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. క్వీన్ సినిమా ఒక్కటి చాలు ఆమె ఎంత మంచి నటో నిరూపించడానికి. ఆ సినిమాకి కంగనా రనౌత్ ఉత్తమ జాతీయ నటి అవార్డు కూడా అందుకుంది.

Video Advertisement

అలాగే ఆ తర్వాత వచ్చిన తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసి ఆ సినిమాకి కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకుంది. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా దేనికే భయపడకుండా తాను అనుకున్నది చెప్పేసే మనస్తత్వం కంగనాది. అందుకే వివాదాల్లో కూడా కంగనా పేరు వినిపిస్తూనే ఉంటుంది.

ఇటీవల కంగనా జడ్జిమెంటల్ హై క్యా అనే సినిమా చేసింది. అందులో పాత కోసం చేసిన లుక్ టెస్ట్ ఫోటోలు ఇటీవల తన టీం ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. పైన ఉన్న ఫోటో ఆ లుక్ టెస్ట్ కి సంబంధించినది.

ఇది మీరు ఇప్పటి వరకు చూడని జడ్జిమెంటల్‌ హై క్యా సినిమాలోని బాబీ క్యారెక్టర్ కోసం చేసిన లుక్ టెస్ట్. మీకు ఏమనిపిస్తోంది? బాబీ ఇలా షార్ట్ హెయిర్ తో బాగుందా? లేదా సినిమాలో చూపించినట్టుగా కర్లీ హెయిర్ తో బాగుందా? కామెంట్స్ లో చెప్పండి అనే క్యాప్షన్ తో ఈ చిత్రాలను పోస్ట్ చేశారు.

జడ్జిమెంటల్‌ హై క్యా గత సంవత్సరం విడుదల అయింది. అసలు మొదట ఈ సినిమాకి పెట్టిన పేరు మెంటల్‌ హై క్యా. కానీ తర్వాత టైటిల్ వివాదాస్పదంగా ఉండటంతో జడ్జిమెంటల్‌ హై క్యా అని మార్చారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు గారి కొడుకు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించారు.


End of Article

You may also like