ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి.!

ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ఎంతలా మారిపోయిందో చూడండి.!

by Harika

Ads

ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించి ఆ తరువాత టాలీవుడ్ కి దూరమైపోయిన నటి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సినిమాలకి దూరమైనా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న ఈ నటి తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పెట్టిన ఒక సెల్ఫీతో ఈమె మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది . నన్ను బాధ పెట్టినా తిరిగి నవ్వుతుంటాను అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

Video Advertisement

మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమే మరెవరో కాదు. మలయాళ చిత్ర పరిశ్రమలో నివేద్యం సినిమాతో కెరీర్ ప్రారంభించిన ప్రముఖ నటి భామ. అందానికి పేరుగాంచిన ఆమె కన్నడ, తమిళం వంటి ఇతర భాషల సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసినా తన నటజీవితంలో మంచి విజయాన్ని అందుకుంది. టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు తనీష్ హీరోగా నటించి,లక్ష్మీ నారాయణ దర్శకత్వం వహించిన “మంచివాడు” సినిమాతో తెలుగులో కూడా అడుగు పెట్టింది.

అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ఉన్నట్లుండి సినీ పరిశ్రమ నుంచి దూరమైంది. ఆమె చివరిగా 2018లో ఖిలాఫత్ అనే మలయాళ చిత్రంలో నటించింది.ఎక్కువగా ఫ్యామిలీ టైమ్ ని ఎంజాయ్ చేస్తూ సినిమాలకి దూరంగా ఉన్న ఈ భామ ఇప్పుడు తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Bhamaa (@bhamaa)

అయితే కొన్ని రోజుల క్రితం ఈమెకు పెళ్లి అయినట్లు తర్వాత భర్తతో విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, భామ కూడా ఈ విషయంపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అయితే భామని సినిమాలో చూసి మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన ప్రేక్షకులు మరీ ఇంతగా మారిపోయింది ఏమిటి అంటూ ఆశ్చర్యపోతున్నారు.


End of Article

You may also like