Home Filmy Adda ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? అందంలో తల్లినే మించిపోయిందిగా.!

ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.? అందంలో తల్లినే మించిపోయిందిగా.!

by Sainath Gopi

ఐశ్వర్యరాయ్ దంపతుల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొద్ది నెలల క్రితం బాబ్డ్ హెయిర్ తో చిన్నపిల్ల లా కనిపించే ఆరాధ్య ఇప్పుడు కొత్త లుక్ తో అదరగొడుతుంది. అందంలో అమ్మని మించిపోయింది అనిపించుకుంటుంది. ఆమె కొత్త లుక్ ని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

అంబానీ పెళ్లి వేడుకలలో ఆరాధ్య స్పెషల్ అట్రాక్షన్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్లో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

did you recognize this heroine daughter

ఈ కార్యక్రమంలో అతిరథ మహారధులందరూ పాల్గొన్నారు. మన టాలీవుడ్ నుంచి రాంచరణ్ దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి తన తల్లిదండ్రులతో పాటు వచ్చింది బచ్చన్ వారసురాలు ఆరాధ్య బచ్చన్. మామూలుగా ఐశ్వర్య రాయ్ కనిపిస్తే ఆమె వెంట పడతారు మీడియా వాళ్లు, కానీ ఈసారి ఆమెని సైడ్ చేసి పక్కన ఉన్న ఆమె కూతురు ఆరాధ్య ని హైలెట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది చూసినప్పుడు బాబ్ కటింగ్ హెయిర్ స్టైల్ తో చాలా చిన్న అమ్మాయిలాగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు హెయిర్ స్టైల్ మార్చేసింది.

did you recognize this heroine daughter

తనని చూస్తే చిన్నప్పటి ఐశ్వర్యారాయ్ ని చూసినట్లు పొడుగ్గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఐశ్వర్య రాయ్ ని మించిన అందంతో మెరుస్తోంది ఈ బ్యూటీ. త్వరలో ఈమెకి హీరోయిన్ అయ్యే లక్షణాలు గట్టిగా కనిపిస్తున్నాయి అంటున్నారు నెటిజన్స్. అయితే కొందరు ఆమెలో వచ్చిన మార్పుని చూసి ఆమె సర్జరీ చేయించుకుంది అంటున్నారు. కానీ కొందరు మాత్రం లేదు ఆమె డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించడం వల్ల అలా కనిపిస్తుంది అంటున్నారు. నిజం ఏదైనాప్పటికీ ఫ్యూచర్లో బాలీవుడ్ హీరోయిన్స్ కి ఆరాధ్య నుంచి గట్టి పోటీ ఉండబోతుంది అనిపిస్తుంది.

You may also like