GUESS THE ACTOR: పూర్తిగా రూపు మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

GUESS THE ACTOR: పూర్తిగా రూపు మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

by Harika

Ads

టాలీవుడ్ లో అందమైన ప్రేమ కథల సినిమాలు ఒక పది చెప్పమంటే అందులో కచ్చితంగా సంపంగి సినిమా ఉంటుంది. 2001 లో వచ్చిన సంపంగి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా విడుదలైన ఈ సినిమా విడుదలైన తరువాత మంచి సక్సెస్ఫుల్ టాక్ సొంతం చేసుకుంది. విభిన్నమైన ప్రేమ కథతో యువతను సినిమాకు కనెక్ట్ అయ్యేలాగా చేసింది. ఒక ముస్లిం అమ్మాయి తెలుగు అబ్బాయి ప్రేమలో పడితే ఆ ఫ్యామిలీస్ ఎలాంటి ఎమోషన్స్ ని ఫీలవుతాయి అనే కాన్సెప్ట్ వచ్చిన సినిమా ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.

Video Advertisement

ఇప్పుడు ఆ సినిమా వివరాలు, విశేషాలు ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం ఈ సినిమాలో హీరోగా దీపక్ నటించాడు. కాగా హీరోయిన్ గా కంచికౌల్ నటించింది. ముస్లిం అమ్మాయిగా నటించి యువత మనసు కొల్లగొట్టింది ఈ భామ. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత ఫ్యామిలీ సర్కస్, మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ తరువాత ఎందుకో అనుకున్నంత సక్సెస్ ని సాధించలేకపోయింది.

తర్వాత పలు టెలివిజన్ షో లో కూడా నటించింది. అలాగే ఒక హిందీ సినిమాలో కూడా కనిపించింది. ఆ తరువాత వెండితెరపై కనుమరుగైపోయింది ఈ భామ. 2005లో ఏక్ లడికి అంజనీ సి అనే టీవీ షోలో ఆఖరి సారి కనిపించింది ఈ భామ. ఆ తరువాత 2011లో నటుడు షబ్బీర్ అహ్లువాలియాని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

వివాహం తర్వాత పూర్తిగా తెరమరుగైపోయిన ఈ భామ ఈ మధ్యనే కొడుకులతో కలిసి మీడియా కంటికి చిక్కింది. మొదట ఈమెను చూసి ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టిన తరువాత ఈమె ఏమిటి ఇంతలా మారిపోయింది అని అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. మీరు కూడా ఒకసారి ఆ ఫోటోలని చూసి గుర్తుపట్టగలరేమో ప్రయత్నించండి.


End of Article

You may also like