సినిమా హీరోలు చాలా మంది సినిమాల్లోకి రాకముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. అంటే, అంతకు ముందు లావుగా ఉండడం, సినిమాల్లోకి రావడానికి సన్నబడడం, ఇంకా నటనకు సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, డాన్స్, ఫైట్స్ లాంటివి నేర్చుకోవడం చేస్తుంటారు.

Video Advertisement

కొంత మంది ఈ విషయాలన్నిటినీ చిన్నప్పటి నుంచే నేర్చుకుంటే, కొంత మంది మాత్రం సినిమాల్లోకి వచ్చే ముందు వీటిపై అవగాహన పెంచుకుంటారు.

Old photo of famous mega hero

అలా సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబం నుండి వచ్చిన కొంత మంది హీరోలు కూడా ఇండస్ట్రీలోకి వచ్చేముందు నటనకు సంబంధించిన విషయాలను తెలుసుకొని మేకోవర్ అయ్యారు. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తిని గమనించారా? ఇతను కూడా ఇటీవల ఒక సూపర్ హిట్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ హీరో రెండవ సినిమా కూడా ఇటీవల విడుదల అయ్యింది. ఈ పాటికే మీలో చాలా మందికి అతనెవరో తెలిసిపోయి ఉంటుంది. ఈ ఫోటోలో ఉన్నది ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన పంజా వైష్ణవ్ తేజ్.

secret behind hero costumes in uppena

ఇది కొన్ని సంవత్సరాల క్రితం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో తీసిన ఫోటో. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, వైష్ణవ్ తేజ్ తన చిన్నతనంలోనే శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఒక పాత్రలో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. తర్వాత వైష్ణవ్ హీరో అవ్వాలి అనుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించడంతో వైష్ణవ్ ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే, ఉప్పెన సినిమా 2020 మొదట్లోనే విడుదలవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. మధ్యలో సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

Uppena Movie Posters

ఎన్నో ఓటీటీ సంస్థలు సినిమా విడుదలకి పెద్ద మొత్తం ఇవ్వడానికి సిద్దపడ్డాయి. కానీ ఉప్పెన సినిమా బృందం మాత్రం ఆ అవకాశాలని తిరస్కరించింది. ఈ సినిమా కేవలం థియేటర్లలో విడుదల అవ్వాలి అని సినిమా బృందం గట్టిగా నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే ఉప్పెన సినిమా థియేటర్లలో విడుదల అయ్యి సంచలన విజయం సాధించింది. మొదటి సినిమా అయినా కూడా హీరో హీరోయిన్లు చాలా బాగా చేశారు అని ఎంతోమంది మెచ్చుకున్నారు. హీరో హీరోయిన్లు, విజయ్ సేతుపతితో పాటు సినిమా బృందం మొత్తానికి చాలా మంచి పేరు వచ్చింది.వైష్ణవ్ ఇటీవల కొండ పొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.