Home Filmy Adda అల్లు అర్జున్ “వరుడు” హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి..?

అల్లు అర్జున్ “వరుడు” హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి..?

by Sainath Gopi

అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వరుడు’ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా విడుదల సమయంలో పెళ్లి సెట్‌తో పాటు అంతలా హాట్ టాపిక్‌గా మారిన అంశం ఏంటి అంటే ఈ చిత్రం లో పెళ్లి కూతురు ప్లస్ హీరోయిన్ ఎవరు అనే..

పోస్టర్లలో ఎక్కడా హీరోయిన్ ముఖాన్ని రివీల్ చేయకుండా గుణశేఖర్ జాగ్రత్తపడ్డాడు. ఆమె ఎవరనే సస్పెన్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు నడిపించాడు. అంతలా ఆసక్తి రేకెత్తించిన ఆ హీరోయిన్ ‘భాను శ్రీ మెహ్రా’ గుర్తుండే ఉంటుంది.

did you remember this allu arjun heroine..

‘వరుడు’ చిత్రం పరాజయాన్ని చవిచూడటంతో తెలుగులో ఈ భామకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

did you remember this allu arjun heroine..

గోవిందుడు అందరివాడేలే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసిన ఈ అమ్మడు గతేడాది నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన కీర్తి సురేష్ సినిమా ‘మిస్ ఇండియా’లో సహానా పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ అక్క పాత్రలో నటించింది. కానీ సినిమాలో భాను శ్రీ కనిపించేది కొంచెం సేపు మాత్రమే. దాంతో పెద్ద సినిమాలో నటించిన కూడా అంత పెద్దగా గుర్తింపు రాలేదు.

did you remember this allu arjun heroine..

భాను శ్రీ మెహ్రా గతేడాది కరణ్‌మన్‌హాస్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం భాను శ్రీ చేతిలో సినిమాలు లేవు. కానీ ఆమె సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫాన్స్ తో టచ్ లోనే ఉంటుంది.

ఫాన్స్

ఆమె ఫొటోలను చూసిన చాలా మంది ఫాన్స్  అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాలో పెళ్లి కూతురిగా నటించిన ఆ అమ్మాయి, ఈ పంజాబీ హాట్ బ్యూటీ ఒకరేనా అని సందేహంతో నోరెళ్లబెడుతున్నారు.

did you remember this allu arjun heroine..

చాలా మంది హీరోయిన్లు కొన్ని సంవత్సరాలు పాటు ప్రేక్షకులకు కనిపించకుండా పోయి మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నారు. వారిలో చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఉన్నారు. మళ్లీ సినిమాల్లో హీరోయిన్ పాత్రలో కాకపోయినా కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరి భాను శ్రీ మెహ్రా కూడా మళ్లీ అలా సినిమాల్లో కనిపిస్తారు ఏమో. ప్రస్తుతం అయితే భాను శ్రీ సినిమాలకి దూరంగానే ఉంటున్నారు. అసలు మళ్లీ సినిమాల్లోకి వస్తారు లేదు అనేది కూడా తెలియదు.

You may also like