తిరుమలలో “శ్రియ”తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఇంత అందంగా ఉంది అనుకుంటున్నారా.!

తిరుమలలో “శ్రియ”తో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఇంత అందంగా ఉంది అనుకుంటున్నారా.!

by Mounika Singaluri

Ads

ఇష్టం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆపై సంతోషం సినిమాలో నాగార్జున సరసన నటించి టాలీవుడ్ లో సుస్థిరమైన ప్లేస్ ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది శ్రియ. ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలతోని నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్ళు అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Video Advertisement

అయితే శ్రియ తాజాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమెతోపాటు ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా వచ్చారు.

వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయటికి వస్తున్న శ్రియ తో ఫోటోలు దిగేందుకు అక్కడ భక్తులు ఉత్సాహపడ్డారు. శ్రియ పక్కనే ఉన్న మరొక అమ్మాయిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు. ఆమె చూడటానికి అచ్చం శ్రియ లాగే ఉంది అదే స్మైల్, అదే ఫేస్ కట్. ఏమరపాటుగా చూస్తే శ్రియ అనే అనుకుంటారు. ఆమె శ్రియ చెల్లెలా అని అందరికీ డౌట్స్ మొదలయ్యాయి. ఇటు సమంత అటు అనుష్క పోలికల తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ భామ.

ఈమె అందం చూస్తుంటే త్వరలో హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అక్కడివాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. అయితే శ్రియ కి ఒక బ్రదర్ మాత్రమే ఉన్నాడని ఇన్నాళ్ళు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తుంటే సిస్టర్ లాగా అనిపిస్తుంది అయితే ఈమె సొంత సిస్టర్ లేకపోతే కజినా అనేది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం ఇప్పుడు ఈ అమ్మడు తన అందంతో తెగ ఫేమస్ అయిపోతుంది. కాబోయే రోజుల్లో హీరోయిన్ గా కనిపించిన ఆశ్చర్యపోనవసరం లేదు.


End of Article

You may also like