Ads
సాధారణ కుటుంబం లో జన్మించి, ఎన్నో కష్టాలకోర్చి స్టార్ హీరోగా ఎదిగారు నందమూరి తారక రామారావు గారు. ఆనతి తరం లో రాముడైనా.. కృష్ణుడైనా ఆయనే అన్నట్లు పేరు సంపాదించుకున్నారు. మాస్ సినిమాలు చేసినా క్లాస్ సినిమాలు చేసినా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంవత్సరం ఆడిన రోజులు కూడా ఉన్నాయి. షూటింగ్ విషయంలో క్రమశిక్షణతో మెలుగుతూ వేగంగా సినిమాలు పూర్తి కావడానికి ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు.
Video Advertisement
అయితే ఆయన ప్రజా శ్రేయస్సు కోరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. అయితే ఎన్టీఆర్ రాజకీయ పార్టీని ఏర్పరిచే నాటికి ఇందిర ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిస్తున్నారామె. ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేసే నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా ఆమె పార్టీనే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక సంఘటన గురించి అందరు చెప్పుకుంటారు.
ఎన్టీఆర్ తన పార్టీ ప్రచారం చేస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్న సమయంలో.. ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ కూడా ఇక్కడికి ప్రచారం చేసేందుకు వచ్చారు. అయితే ఇందిరాగాంధీ తిరుపతి సభ జరుగుతున్నా చోటుకి దగ్గర్లోనే ఎన్టీఆర్ సభకి కూడా అనుమతి ఇచ్చారు. అయితే ప్రధాన మంత్రి సభ జరుగుతుండటం తో ఎన్టీఆర్ ర్యాలీ ని, ఆ వాహనాలను తిరుపతిలోకి అనుమతించలేదట అధికారులు. ఆ తర్వాత ప్రధానమంత్రి సభ చివరికి వస్తున్న తరుణం లో ఎన్టీఆర్ వాహనాన్ని అనుమతించారట.
అయితే అప్పుడు దూరంగా ‘చెయ్యేట్టు జై కొట్టు తెలుగోడా..’ అనే పాట వినిపించడం తో ప్రధానమంత్రి సభ లో ఉన్న ప్రజలంతా పరుగులు పెడుతూ ఎన్టీఆర్ సభకి వెళ్లిపోయారట. అప్పుడు ఇందిరా గాంధీ ఏమైందని తెలుసుకొని.. ఎన్టీఆర్ కి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చూసి షాక్ అయ్యారట. దీంతో ఆయన్ని చాలా తక్కువగా అంచనా వేశామని ఆమె తమ పార్టీ నాయకులతో చర్చించారట. తర్వాత వెంటనే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగక ముందే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
watch video :
End of Article