Ads
దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని.. ఉవ్వెత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు మహాత్మా గాంధీ. శాంతియుత మార్గంలో యుద్ధ తంత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. రక్తం చుక్క నేల రాలకుండా దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. అందుకే మనకి ఇప్పటికీ ఆయనపేరు తలచుకోగానే సత్యం, అహింస మాత్రమే గుర్తొస్తాయి. కానీ గాంధీజీ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
Video Advertisement
గాంధీజీ జీవితం, ఆయన జీవనశైలి మనకు అమూల్యమైన సూత్రాలను బోధిస్తాయి. వీటిని మనం మన జీవితంలో అవలంబించి ఆరోగ్యవంతులుగా మారవచ్చు. గాంధీ గారు మానవ శరీరాన్ని దేవాలయంగా విశ్వసించేవారు. అందుకే దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని తరచూ సూచించేవారు. రకరకాల ఆహార పదార్థాలను కడుపులో వేసి పొట్టను చెత్త కుండీలా మార్చుకోవద్దని గాంధీజీ తరచూ చెప్పేవారు. ఇప్పుడు గాంధీజీ పాటించిన ఆరోగ్యకరమైన అలవాట్లు ఏవో చూద్దాం ..
#1 నడక
గాంధీజీ ఎక్కువగా నడిచేవారు. గాంధీజీ తన జీవితంలో 79000 కిలోమీటర్లు నడిచారు.అంటే ప్రతిరోజూ 18 కిలోమీటర్లు నడిచేవారు.
#2 ఉపవాసం
బాపూజీ రోజూ ఒక పూట మాత్రమే భోజనం తినేవారు. అలాగే ఉపవాసాలు ఎక్కువగా చేసేవారు. ఉపవాసం వాళ్ళ జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుందని ఆయన నమ్మేవారు.
#3 శాకాహారం
గాంధీ తన జీవితకాలంలో ఒక్కసారి కూడా మాంసాహారం తినలేదు. 1888లో న్యాయశాస్త్రం చదవడానికి ఇంగ్లండ్‌కు వెళ్లేముందు మాంసం తిననని, మద్యం ముట్టుకోనని తన తల్లికి ప్రమాణం చేశారు. శాకాహారం దొరకడం కష్టమైనా, ఎప్పుడూ ఆకలితో ఉన్నా ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. మాంసాహారం ఆరోగ్యానికి మంచిది కాదని గాంధీ దృఢంగా విశ్వసించారు.
#4 తేనే, బెల్లం
గాంధీజీ చక్కెర కు దూరంగా ఉండేవారు. దానికి బదులుగా బెల్లం లేదా తేనెను వాడేవారు.
#5 పోలిష్డ్ ఆహారపదార్దాలు
గాంధీజీ ఏ విధమైన పాలిష్ ఆహార ధాన్యాలను తీసుకొనేవారు కాదు.
#6 ఆహార నియమాలు
గాంధీజీ ఆహారంతో చేసిన ప్రయోగాల ఆధారంగా కొన్ని నియమాలను పాటించేవారు.పలు ధాన్యపు గింజలు కలిపి తినకూడదని చెప్పేవారు. పాలతో చపాతీ, రోటీ తినకూడదని గాంధీ చెబుతుండేవారు. భోజనంలో చపాతీ మరియు కూరగాయలు ఉండాలని సూచించేవారు. తృణ ధాన్యాలు, వరి, జొన్న, రాగులు వంటివి కూడా శరీరానికి బలం ఇస్తాయని గాంధీజీ నమ్మేవారు.
#7 వ్యక్తిగత పరిశుభ్రత
గాంధీజీ వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. మితాహారం, వ్యక్తిగత పరిశుభ్రత వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నమ్మారు.
#8 పానీయాలు
టీ, కాఫీ మరియు కోకో మానవ శరీరానికి పూర్తిగా అవసరం లేదని గాంధీజీ దృఢంగా విశ్వసించారు. వాటికి బదులుగా తేనె, వేడినీరు, నిమ్మకాయలతో కూడిన పానీయాన్ని తాగాలని సూచించేవారు. ఆయన ఆల్కహాల్ కి దూరంగా ఉండేవారు.
#9 ధ్యానం
మనిషి తన మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ప్రశాంతతను పెంపొందించుకోవడం కోసం ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలన్నది గాంధీ సిద్ధాంతం. ఆయన ప్రతీ రోజు ధ్యానం చేసేవారు.
End of Article