ఆ సన్నివేశాలు లేకుంటే… నితిన్ “శ్రీ ఆంజనేయం” సినిమా “హనుమాన్” కంటే పెద్ద హిట్ అయ్యుండేదా.?

ఆ సన్నివేశాలు లేకుంటే… నితిన్ “శ్రీ ఆంజనేయం” సినిమా “హనుమాన్” కంటే పెద్ద హిట్ అయ్యుండేదా.?

by Mounika Singaluri

Ads

కృష్ణవంశీ డైరెక్షన్లో 2004లో విడుదలైన ఫాంటసీ యాక్షన్ చిత్రం శ్రీ ఆంజనేయం గురించి అందరికీ తెలిసిందే. నితిన్, చార్మి, అర్జున్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం సమకూర్చారు. కృష్ణవంశీ అప్పటికే మంచి ఫామ్ లో ఉన్న దర్శకుడు. సింధూరం, నిన్నే పెళ్లాడుతా వంటి సినిమాలు తీసి హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు. కృష్ణవంశీ డైరెక్షన్లో ఈ సినిమా వస్తుంది అనేటప్పటికీ సినిమాపై అందరికీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.

Video Advertisement

అయితే అందరూ అనుకున్నట్లుగా కాకుండా ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో కధ అందరికీ నచ్చుతుంది కానీ ఇందులో ఛార్మి చేసిన ఓవర్ ఎక్స్పోజింగ్ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. భక్తి రసాత్మక చిత్రంలో అలాంటి సీన్స్ ప్రేక్షకులు ఆహ్వానించలేకపోయారు. ఛార్మికి పాము కుట్టిన సమయంలో నితిన్ నోటితో విషం తీసే సీన్ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.

ఆ సీన్ లేకపోయి ఉండి ఉంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా విజయం సాధించినట్లే అప్పుడు శ్రీ ఆంజనేయం కూడా మంచి హిట్ సాధించేది అని తెలుగు సినిమా ప్రేక్షకులు అంటున్నారు. హనుమాన్ సినిమాలో కూడా లవ్ ట్రాక్ ఉంటుంది కానీ అది అసలు కథను ఎక్కడ డిస్టర్బ్ చేయదు. అందుకే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. కానీ శ్రీ ఆంజనేయంలో కృష్ణవంశీ ఆ పాయింట్ మిస్ అయినట్లుగా ఉన్నారు. హనుమాన్ సినిమా ఇటీవలే ఒటిటిలో కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

సెకండ్ హాఫ్ అంతా ఆంజనేయస్వామితో కథని బాగానే నడిపించినా ఫస్టాఫ్ అంతా చార్మి ఓవర్ ఎక్స్పోజింగ్ తోనే కధ నడుస్తుంది.అయితే హీరో నితిన్ కి తను నటించిన సినిమాలలో శ్రీ ఆంజనేయం సినిమా అంటే చాలా ఇష్టమని, చిన్నచిన్న మిస్టేక్స్ తప్పితే ఆ సినిమా చాలా బాగుంటుందని, ఇప్పుడు ఉన్న టెక్నికల్ వాల్యూస్ ని వాడుకొని ఈ సినిమాని రీమేక్ చేస్తే మంచి విజయం సాధిస్తుందని కామెంట్ చేశారు నితిన్.


End of Article

You may also like