Ads
స్ట్రీట్ ఫుడ్ ఆంటీ, అలియాస్ సాయి కుమారి స్టాల్ ని తీసేయమంటూ పోలీసులు ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ రేవంత్ రెడ్డి స్టాల్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం తెలిసిందే. నిన్నటి నుండి ఈ సంఘటన గురించి హైదరాబాద్ అంతా మాట్లాడుకుంది.
Video Advertisement
పబ్లిసిటీ వల్ల ఇలా అయ్యింది అని, తనని పబ్లిసిటీ చేయొద్దు అని సాయి కుమారి అడిగారు. ఇటీవల ఊరి పేరు భైరవకోన సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఫుడ్ స్టాల్ కి వెళ్లిన సందీప్ కిషన్ కూడా సాయి కుమారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు.
అయితే ఈ సంఘటన మీద రెండు వేరు వేరు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, “సాయి కుమారి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. దాదాపు పది సంవత్సరాలకి పైగా ఈ స్టాల్ ఉంది. అప్పటి నుండి వంట చేస్తూ, ఇప్పుడు ఇంత మంచి స్థాయికి వచ్చారు. నిన్న ఒక్కరోజు సరిగ్గా నడవకపోవడం వల్ల దాదాపు 50 వేల నష్టం వచ్చింది అంటే వాళ్ళు ఎంత కష్టపడతారో, వారి ఆహారానికి ఎంత మంది అభిమానులు ఉన్నారు అనే విషయం అర్థం అయిపోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంకా ప్రోత్సహించాలి కానీ, ఇలాంటి పనులు చేయకూడదు.”
“ఆమె లాంటి వ్యాపారులకి ప్రోత్సాహం కొండంత బలాన్ని ఇస్తుంది. దాంతో వారు ఇంకా గొప్ప స్థాయికి ఎదగగలరు” అని అనే వాళ్ళు కొంత మంది ఉన్నారు. మరి కొంత మంది ఇంకొక రకమైన వాదనను వినిపిస్తున్నారు. అదేంటంటే, “ఈ స్టాల్ అనేది రోడ్ పక్కన ఉంది. భోజనం అనేది బాగుంటే జనాలు రావడం సహజమైన విషయం. ఒకసారి, రెండు సార్లు అంటే కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ప్రతిసారి అంటే కంట్రోల్ చేయలేరు. అక్కడ ఎన్నో కంపెనీలు ఉన్నాయి.”
“ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. అలాంటప్పుడు, ఇలాంటి ఒక స్టాల్ అక్కడ ఉండడం వలన ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి” అని అంటున్నారు. “ఆమె మరొక దగ్గర ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం మంచి నిర్ణయం ఏమో” అని అంటున్నారు. అప్పుడు అటు వాళ్ళ స్టాల్ కూడా బాగా నడుస్తుంది. ఇటు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువగా ఉండదు అని అంటున్నారు. మీరు ఎటు వైపు సమర్థిస్తారు? ఎవరి చెప్పిన మాట సరైనది అని మీరు అనుకుంటున్నారు?
ALSO READ : అయోధ్య రామ మందిరం మీద మరొకసారి ఈర్షని ప్రదర్శించిన పాకిస్తాన్..! ఈసారి ఏకంగా వారికే లెటర్… ఏం రాశారంటే..?
End of Article