“దిల్” హీరోయిన్ “నేహా” గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

“దిల్” హీరోయిన్ “నేహా” గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

by Mohana Priya

Ads

నితిన్ కెరీర్లో మొదటి కమర్షియల్ హిట్ అయిన సినిమా దిల్. ఈ సినిమా నితిన్ రెండవ సినిమా అయినా కూడా తన పెర్ఫార్మెన్స్ తో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించగా దిల్ రాజు గారు ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు.

Video Advertisement

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మించారు. ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. దిల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు నేహా. ఈ సినిమా తర్వాత అతడే ఒక సైన్యం సినిమాలో కూడా జగపతి బాబు పక్కన హీరోయిన్ గా నటించారు నేహా. ఆ తర్వాత దోస్త్ సినిమాలో నటించారు.

తర్వాత కొంత కాలానికి దుబాయ్ శీను సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. అలాగే బొమ్మరిల్లు సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు నేహా. కానీ తర్వాత ఎక్కువ ఎక్కడా కనిపించలేదు. నేహా ఇప్పుడు రిషిరాజ్ జవేరిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఇప్పుడు ఒక పాప కూడా ఉన్నారు.

 

నేహా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా కూడా లేరు. నేహా కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా హిందీలో కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. ప్రస్తుతం నేహా సినిమాలకి, సీరియల్స్ కి దూరంగా ఉంటున్నారు. మళ్ళీ ఒక మంచి పాత్రతో నేహా మనల్ని అలరించాలని ఆశిద్దాం.


End of Article

You may also like