ఫ్లాప్ అవుతాయి అని తెలిసినా కూడా… “దిల్ రాజు” తీసిన సినిమాలు ఏవో తెలుసా..?

ఫ్లాప్ అవుతాయి అని తెలిసినా కూడా… “దిల్ రాజు” తీసిన సినిమాలు ఏవో తెలుసా..?

by Mounika Singaluri

Ads

ఒక సినిమా తీయాలి అంటే దాని వెనక ఎంతో కథ ఉంటుంది ఎన్నో బాధలు, బాధ్యతలు, ఇబ్బందులు ఉంటాయి. ఒక సినిమా తీయాలి అంటే కథ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ క్యారెక్టర్ కి ఏ నటుడు సెట్ అవుతాడు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.

Video Advertisement

ఒక సినిమాకి సంబంధించి 24 శాఖలు ఉంటాయి, అవి అన్ని సమన్వయంలో నడిచినప్పుడే సినిమా అనుకున్న విధంగా పూర్తి అవుతుంది. ఈ మధ్య సినిమా విడుదల చేయడానికి ఎంతో హడావిడి ,ప్రోమోలు ,ప్రమోషన్ ఈవెంట్లు అవసరం అవుతున్నాయి. ఇంకా చేసి సినిమా రిలీజ్ చేస్తే అది ప్రేక్షక ఆదరణ పొందుతుందా అన్న గ్యారంటీ లేదు.

3 dil raju

ఈ క్రమంలో ఒక సినిమా ఖర్చు భారీగా పెరిగింది. ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా క్లిక్ అయితే పర్వాలేదు కానీ పొరపాటున ఫ్లాప్ అయిందా నిండా మునిగేది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. అయితే ఎవరైనా తను తీసిన సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అవుతుంది అని తెలిసి కూడా ఆ సినిమాని రిలీజ్ చేస్తారా…. చేయాలనుకుంటున్నారేమో చేశారు…అది ఎవరో కాదు ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినా దిల్ రాజు. దిల్ రాజు కు తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయన ఏదైనా సినిమా గురించి తన అభిప్రాయం వ్యక్తం చేస్తే అది కచ్చితంగా జరుగుతుంది అన్న అభిప్రాయం కూడా ఉంది.

తన సినిమాలు రిలీజ్ కి ముందే అవి మార్కెట్లో హిట్ అవుతాయా? ఫ్లాప్ అవుతాయా అన్న ఒక అంచనా వేసుకునే దిల్ రాజు, ఈ రెండు సినిమాలు మాత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి అని తెలిసి కూడా ధైర్యంగా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్లను నిండా ముంచాడు. ఆ సినిమాలు ఏవో తెలుసా? ఒకటి ప్రభాస్ నటించిన మున్నా అయితే మరొకటి కార్తి హీరోగా వచ్చిన చెలియా. విశేషమేమిటంటే ఈ సినిమాల రిలీజ్ కి ఒకరోజు ముందే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసిన దిల్ రాజు ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచొచ్చు కానీ భయపడకండి మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పాడంట. ఈ విధంగా ఫ్లాప్ అవుతాయి అని తెలిసినా ధైర్యంగా సినిమాలను రిలీజ్ చేసిన ఘనత దిల్ రాజుకే దక్కుతుంది.


End of Article

You may also like