సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న “దిల్ రాజు” భార్య.?

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న “దిల్ రాజు” భార్య.?

by Megha Varna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి దిల్ సినిమాతో ప్రొడ్యూసర్ అయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మిస్తూ, ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ బాధ్యత కూడా వహిస్తూ అంచెలంచెలుగా పైకి ఎదిగారు.దిల్ రాజు మొదటి భార్య అనిత. వాళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉన్నారు. 2017 లో అనిత గారు ఆరోగ్య సమస్యల కారణంగా మరణించారు. భార్య మరణం తర్వాత దిల్ రాజు కొంతకాలం పాటు మీడియా కి దూరంగా ఉన్నారు. తర్వాత మళ్లీ తన సినిమా నిర్మాణ పనులను నిర్వహిస్తూ ఆ సినిమాల ప్రచారం కోసం బయట కూడా కనిపిస్తున్నారు.

Video Advertisement

లాక్ డౌన్ సమయం లో మే నెలలో దిల్ రాజు తేజస్విని ని రెండో పెళ్లి చేసుకున్నారు. ఏ హంగు ఆర్భాటం లేకుండా ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. దిల్ రాజు, తేజస్విని కి సంబంధించిన ముఖ్యమైన వాళ్లను తప్ప ఎక్కువ మందిని పిలవలేదు. కానీ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి.  దిల్ రాజు, తేజస్విని తో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dil Raju Marriage Photos

దిల్ రాజు గారు నిర్మిస్తున్న “వకీల్ సాబ్” కోసం ఆడియన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. కొన్నిసంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ను తెరపై చూడబోతున్నాం అనే ఆనందంలో ఉన్నారు ఫాన్స్. ఇది ఇలా ఉండగా…కరోనా కారణంగా థియేటర్స్ లేకపోవడంతో చాలా సినిమాలు ఓటిటి ప్లాటుఫార్మ్స్ లోనే విడుదల అయ్యాయి. ఇటీవల దిల్ రాజు నిర్మించిన “వీ” చిత్రం కూడా ఓటిటి లోనే విడుదల అయ్యింది.

hmtv కథనం ప్రకారం..లాక్ డౌన్ టైం లో దిల్ రాజు గారి భార్య తేజస్విని ఓటిటి కోసం ఓ కథ రాసారంట. ఆ స్టోరీ కి దిల్ రాజు గారు ఫిదా అయ్యారంట. ఆ కథకు ఎడిటింగ్స్ చేస్తున్నారంట దిల్ రాజు టీం.

 


You may also like