Home Filmy Adda “సీతా రామం” సినిమాలో నటించిన… ఆ 5 మంది డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

“సీతా రామం” సినిమాలో నటించిన… ఆ 5 మంది డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

ఇటీవల మంచి ప్రేమ కథతో విడుదల అయిన సినిమా సీతా రామం బాక్సాఫీసులో విజయ ఢంకా మోగిస్తోంది. అయితే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరొక అయిదుగురు దర్శకులు ఈ సినిమాలో నటించడం సినిమాకి ఉన్న ప్రత్యేకత. ఆ అయిదుగురు దర్శకులు వీళ్ళే.

 

1. గౌతమ్ మీనన్

ఎన్నో వినూత్న పాత్రలను అందిస్తూ, ఇరువురి మధ్య ఒక సున్నితమైన ప్రేమ భావాలను చూపిస్తూ, అందులో కొంత సస్పెన్స్ ని జోడిస్తూ ప్రేక్షకుల మనసులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ మీనన్, సీతా రామమ్ సినిమాలో మేజర్ సెల్వన్ పాత్రలో నటించారు.

directors who acted in sita ramam

2. తరుణ్ భాస్కర్

నేటి తరం యువతను ఆకట్టుకునే విధంగా, నవ్విస్తూ కవ్వించే సినిమాలు తీస్తుంటారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకలకు మరింత చేరువ అయ్యారు. ఒకరకంగా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ తీస్తూనే అందులో కొంత మెసేజ్ ఇస్తుంటారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇప్పుడు సీతా రామమ్ లో ఆఫ్రీన్ సీనియర్ బాలాజీ అనే పాత్రలో నటించారు.

directors who acted in sita ramam

3. రాహుల్ రవీంద్రన్

సున్నితమైన ప్రేమాయణం, సహజమైన తాత్పర్యాన్ని అందిస్తూ, ఒక సపరేట్ కేటగిరీ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న రాహుల్ రవీంద్రన్, సీతా రామమ్ సినిమాలో పాకిస్థాన్ ని ఇండియన్ డిప్లొమాట్ రాహుల్ వర్మ గా నటించారు.

directors who acted in sita ramam

4. సందీప్ రాజ్

ఒక నటుడిగా, రచయితగా, మరీ ముఖ్యంగా అవార్డ్ అందుకునే సినిమా కాలర్ ఫోటోకి దర్శకత్వం వహించిన దర్శకుడు సందీప్ రాజు కూడా సీతా రామమ్ సినిమాలో,ఒక చిన్న పాత్రను పోషించారు.

directors who acted in sita ramam

5. ప్రకాష్ రాజ్

సినీ పరశ్రమలో ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే నటనలోనూ, దర్శకత్వంలోనూ తనకున్న రికార్డ్స్ అలాంటివి మరి. ధోనీ, ఉలవచారు బిర్యానీ, మనవూరి రామాయణం వంటి ఎన్నో చిత్రాలను అనేక భాషల్లో డైరెక్ట్ చేసిన మహా మేధావి ప్రకాష్ రాజ్. సీతా రామమ్ మూవీలో ఆయన ఇండియన్ ఆర్మీ చీఫ్ గా నటించారు.

directors who acted in sita ramam

You may also like