భర్త వేధింపుల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోవడం మనం చూసే ఉంటాం. కానీ తాజాగా భార్య తీరుతో విసిగిపోయి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… బీహార్ లోని భాగాలు పూర్ లో ఇది చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో పని చేస్తున్న జూనియర్ ఇంజనీర్ రణ్ ధీర్ భార్య, అత్త బాధని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

Video Advertisement

రణ్ ధీర్ పరమానంద పూర్ గ్రామానికి చెందిన రాధ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్ని నెలల భార్య భర్తలు బాగానే ఉన్నారు. అత్తింటివారు కూడా ఇతన్ని బాగానే చూసుకునేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ భార్య ప్రవర్తన లో మార్పు కనబడింది. భార్య అత్తింటివారు కలిసి రణ్ ధీర్ ని పలు విధాలుగా వేధించడం మొదలుపెట్టారు. విడాకులు ఇవ్వాలని ఆ అమ్మాయికి వేరే పెళ్లి కూడా చేస్తామని అత్త బెదిరించింది.

తన భార్య కూడా నువ్వంటే ఇష్టం లేదని చెప్పేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందాడు. అలా మానసిక ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకుకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో తల్లిదండ్రులకి అనుమానం వచ్చి కొడుకు ఉంటున్న క్వార్టర్స్ కి వెళ్లి చూశారు.

ఇంకేం వుంది చూసేసరికి కొడుకు మృతి చెందాడు. పోలీసులు పరిశీలించగా ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ దొరికింది. భార్య, అత్తమామల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాశాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.