ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్స్ పెడుతున్నారో చూడండి!

ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్స్ పెడుతున్నారో చూడండి!

by Megha Varna

Ads

ఒక పక్క ఒక అమ్మాయిని చంపేశారు అంటే…ఎంత నీచంగా కామెంట్ చేస్తున్నారో కొందరు. తప్పులేదు అతను అలా చంపేయడంలో. ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాడు కదా అంటూ చంపినోడిని సమర్థిస్తున్నారు. అసలు మీకు అమ్మాయి గురించి ఏం తెలియకుండా అలా తప్పుగా ఎలా అనేస్తారు. గతంలో దిశా విషయంలో కూడా కొందరు ఇలాగె అన్నారు. అమ్మాయి నిజంగానే తప్పు చేసిన చంపేయడం అనేది చాలా పెద్ద తప్పు. మానవత్వం లేనప్పుడు ఎన్ని చదువులు చదువుకొని ఏం లాభం. మీ అంతటా మీరుగా మారాలి. మీలాంటి మూర్ఖులను వేరే వారు మార్చలేరు.

Video Advertisement

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె.. రూమ్ లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. బ్యాంక్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న దివ్య (25) అనే యువతి వివాహం ఈ నెల 26 న జరగనుంది. తల్లిదండ్రులు ఆమె పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లారు. ఇదే సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని.. అతడే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లి మణెమ్మ పోలీసులకు తెలిపింది.

రోజు లాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. ఆమె తల్లితండ్రులు వివాహ పత్రిక పంచడానికి వెళ్లారు. ఇదే సమయంలో పతకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టాడు నీచుడు. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.


End of Article

You may also like