Ads
ఇటీవల ఓటీటీలో విడుదలైన సినిమాల్లో కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఇందులో ముఖ్యంగా కలర్ ఫోటో అయితే ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ నవంబర్ 20 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమాకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ రెండు సినిమాలు చాలా నాచురల్ గా ఉన్నాయి అని అంటున్నారు ప్రేక్షకులు. ఈ రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటి దివ్య శ్రీపాద.
Video Advertisement
దివ్య ని మనలో చాలా మంది అంతకుముందు చాయ్ బిస్కెట్, గర్ల్ ఫార్ములా వీడియోస్ లో చూసే ఉంటాం. దివ్య యాక్టింగ్ లోకి అడుగుపెట్టక ముందు ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కానీ ఉద్యోగం నచ్చక, ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. గర్ల్ ఫార్ములా లో ఆడిషన్ లో సెలక్ట్ అయ్యారు దివ్య. 2019 లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో దివ్య మొదటి సారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించారు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా కనిపించారు దివ్య.
తర్వాత ఇటీవల వచ్చిన కలర్ ఫోటో సినిమాలో, మిడిల్ క్లాస్ మెలోడీస్ లో, అలాగే మిస్ ఇండియా, జాతి రత్నాలు సినిమాలో కూడా నటించారు దివ్య. అయితే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ లో ఒక షాట్ లో హీరోయిన్ రష్మిక మందన కనిపిస్తారు. ఒకసారి మనం సరిగ్గా గమనిస్తే అదే షాట్ లో రష్మిక తో పాటు దివ్య కూడా కనిపిస్తారు. ప్రస్తుతం ఈ విషయంపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
End of Article