Ads
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసును విశాఖపట్నం పోలీసులు ఛేదించారు.హత్యకు గురైన దివ్య మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు..పోస్ట్ మార్టం రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.. దివ్య ఒంటిపై 33చోట్ల గాయాలున్నట్టుగా తెలిసింది.అంతే కాదు తను కొంత కాలంగా ఆహారం తినకపోవడం వల్ల చనిపోయినట్టుగా రిపోర్ట్ లో వెల్లడయింది..అనేక చిత్రహింసలకు గురి అయినట్టుగా పోలీసులు గుర్తించారు..ఈ హత్యకు కారణం విశాఖ అక్కయ్యపాలెం వాసి వసంతగా గుర్తించారు పోలీసులు.
Video Advertisement
రెండు రోజుల క్రితం అక్కయ్య పాలెంకి చెందిన వసంత నుండి జ్ణానపురం లోని అంతిమయాత్ర వాహనం యజమానికి ఒక ఫోన్ వచ్చింది.. ఒక శవాన్ని శ్మశానికి చేర్చాలని..అసలే రోజులు బాగాలేకపోవడంతో అతడు ముందు ఒప్పుకోలేదు..కానీ ఎంత డబ్బు అయినా ఇస్తాను అనే సరికి ఒప్పుకున్న ఆ వ్యక్తి సరే అని అక్కడికి చేరుకుని శవాన్ని వాహనంలోకి చేరుస్తుంటే బాడిపై ఉన్న దెబ్బలు చూసి, అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేశాడు.
చిత్రహింసలకు గురై మరణించినట్టుగా ప్రాధమికంగా గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . అసలు ఎవరు ఆ అమ్మాయి , వసంతకి తనకి ఏంటి పరిచయం అని ఆరాతీశారు పోలీసులు..తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఊబలంకకు చెందిన ఇరవైఏళ్ల దివ్య తల్లిదండ్రులు చనిపోవడంతో బతుకుదెరువు కోసం విశాఖపట్నం వచ్చింది. అక్కడ వసంత పరిచయంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని బతకొచ్చు అనుకుంది.. అప్పటికే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వసంత ,దివ్యను కూడా వ్యబిచార రొంపిలోకి దింపింది..
కొన్నాళ్లకు దివ్యకు కూడా ఆ జీవితం అలవాటైపోయింది..అందరిని తన అందంతో ఆకట్టుకుంటున్న దివ్య , వసంత కంటే ఎక్కువ సంపాదిస్తుండడంతో వసంతలో అసూయ పెరిగిపోయింది. ఇద్దరి మద్య డబ్బుల విషయంలో గొడవ రావడంతో.. అప్పటికే దివ్య తన అందంతో అందరిని ఆకట్టుకుంటుండడం, బాగా డబ్బు సంపాదింస్తుడడంతో , ఎలా అయినా దివ్యని మట్టుపెట్టాలనుకుంది.అనుకున్నదే తడవుగా దివ్యను గదిలో బంధించింది.
గత నెల రోజుల నుండి దివ్యకి ఆహారం అందించకుండా చిత్రహింసలకు గురిచేసింది..నెలరోజుల పాటు వసంత పెట్టిన టార్చర్ భరించిన దివ్య చివరికి కన్నుబూసింది.. మొత్తానికి ఆ డ్రైవర్ అనుమానంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొదట్లో దివ్య సహజంగా మరణించిందని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిన వసంత ,ఆఖరికి నిజం ఒప్పుకుంది.. వసంత సోదరి,మరిది కూడా వసంతకు సహకరించారని తేలడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
End of Article