గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగి దివ్య కేసులో కొత్త ట్విస్ట్..! వారిద్దరికీ ముందే పెళ్లయ్యిందంట?

గజ్వేల్ బ్యాంక్ ఉద్యోగి దివ్య కేసులో కొత్త ట్విస్ట్..! వారిద్దరికీ ముందే పెళ్లయ్యిందంట?

by Megha Varna

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. త్వరలో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఆమె.. రూమ్ లో రక్తపు మడుగులో నిర్జీవంగా కనిపించారు. బ్యాంక్‌ ఉద్యోగినిగా పనిచేస్తున్న దివ్య (25) అనే యువతి వివాహం ఈ నెల 26 న జరగనుంది. తల్లిదండ్రులు ఆమె పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లారు. ఇదే సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.8వ తరగతిలో దివ్యతో కలిసి చదువుకున్న వేములవాడకు చెందిన వెంకటేశం అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడని.. అతడే తన బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని మృతురాలి తల్లి మణెమ్మ పోలీసులకు తెలిపింది.

Video Advertisement

రోజు లాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. ఆమె తల్లితండ్రులు వివాహ పత్రిక పంచడానికి వెళ్లారు. ఇదే సమయంలో పతకం ప్రకారం ఈ దారుణానికి ఒడిగట్టాడు నీచుడు. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

ఇది ఇలా ఉండగా..ఆ నిందితుడు దొరికాడు. తన ప్రేమ విఫలం కావడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడానని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అనుకోని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది…తన కొడుకుని ప్రేమ పెళ్లి చేసుకుందని దివ్యను ఆమె తల్లిదండ్రులు వేములవాడలోనే వదిలేసి వెళ్లిపోయారని నిందితుడి తండ్రి పరశురామ్ గౌడ్ వివరించారు. దివ్యకి ఉద్యోగం రావడంతో ఆమె మనసుని మార్చారని తెలిపారు. మరో వ్యక్తితో దివ్య తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారని చెప్పారు. దివ్య మిస్ అయ్యిందని ఆమె తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే.. పోలీసులు దివ్య తల్లిదండ్రులపైనే కోప్పడ్డారని పరశురామ్ చెప్పారు. దివ్య, వెంకటేశ్ లను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని పరశురామ్ వెల్లడించారు.


You may also like

Leave a Comment