Ads
దీపావళి పండుగ అంటే అందరికీ బాగా ఇష్టమే. భారతదేశంలో ఎక్కువ శాతం మంది జరుపుకునే పండుగ దీపావళి.. దీపావళి పండుగ వస్తే దేశమంతా వెలుగులతో విరజిల్లుతుంది. దీపావళి పండుగకు ఉండే సందడే వేరు. అయితే మన దేశం లోనే కాకుండా వేరే దేశం లో ఉన్న హిందువులు దీపావళి పండుగలు జరుపుకుంటూ ఉంటారు.
Video Advertisement
అయితే ఎవరూ ఊహించని విధంగా పాకిస్తాన్ లో దీపావళి వేడుకలు జరిగాయి. పాకిస్తాన్ లో ఉండే హిందువులు దీపావళి వేడుకలు జరుపుకోగ,ఆ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
కరాచీలో ఉండే వందేళ్ల నాటి స్వామి నారాయణ ఆలయంలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పాకిస్తాన్ లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో హిందూ ఆలయాలు కూడా ఉంటాయి. కానీ దీపావళి పండుగ వస్తే ఎక్కువ మంది హిందువులు స్వామి నారాయణ ఆలయానికి వస్తూ ఉంటారు. కరాచీలో ఉన్న హిందువులు దీపాలు వెలిగించడంతోపాటు తమ ఇళ్ళ ముందు రంగులు వేసి పూజలు జరిపారు. హిందువులతో పాటు పలువురు ముస్లింలు కూడా ఈ దీపావళి వేడుకల్లో పాల్గొనడం విశేషం.
స్వీట్స్ తీసుకువచ్చి లక్ష్మీదేవి ఆలయానికి విచ్చేసి ఫోటోకి పూజలు జరిపి కుటుంబంతో కలిసి సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకున్నామని కరాచీలో ఉన్న హిందువులు తెలిపారు.పలువురు ముస్లిం లు అయితే దీపావళి వేడుకలు చూసేందుకు వచ్చాం అని తెలియజేశారు.వారితో కలిసి పూజలు చేసి టపాసులు కాల్చమని తెలిపారు.వారి పూజలను గౌరవిస్తామని ముస్లింలు తెలిపారు. పాకిస్తాన్ విభజనకు ముందు గాంధీజీ ఈ ఆలయానికి వచ్చారని చెబుతారు.ముస్లిం దేశమైన పాకిస్తాన్ లో మత సామరస్యానికి ప్రత్యేకమైన దీపావళి వేడుక జరుపుకోవడం నిజంగా శుభసూచకమైన విషయం.పాకిస్తాన్ లో దీపావళి వేడుకలకు సంబంధించిన వీడియో BBC ఛానెల్ ప్రసారం చేసింది.
watch video :
Also Read:దివాళిపై ట్రెండ్ అవుతున్న 35 మీమ్స్…నాసా ఫోటో అంటూ వాట్సాప్ అంకూల్స్, దీపాలతో ఫోటోలు అంటూ అమ్మాయిలు
End of Article