Anupama: అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిందని తెలుసా..? ఏ సినిమాకి అంటే..?

Anupama: అనుపమ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిందని తెలుసా..? ఏ సినిమాకి అంటే..?

by Megha Varna

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అలాగే కొందరి వ్యక్తులతో జీవితాన్ని గడిపిన అద్భుతమైన రోజులు కూడా ఉంటాయి. అలాంటి రోజులు ఎప్పటికీ మధురంగా మిగిలిపోతాయి. అయితే అనుపమ పరమేశ్వరన్ కి మాత్రం ఈ యాభై ఎనిమిది రోజులు చాలా బాగా గుర్తుండిపోయాయి మరియు అద్భుతమైనవి అని అన్నారు.

Video Advertisement

ఇక దీనికోసం వివరాల్లోకి వెళితే… అందాల తార అనుపమ పరమేశ్వరన్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈమె కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారట. తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న సూపర్ కింగ్స్ అనే షోలో పాల్గొని అనుపమ పలు విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది.

దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మలయాళంలో తెరకెక్కిన ఓ చిత్రానికి అనుపమ పరమేశ్వరన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. మొట్టమొదటి సారి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది అయితే ఆ సినిమా షూటింగ్ అయిన 58 రోజులు కూడా ఎంతో బాగా ఆమె గుర్తుండిపోయాయని అన్నారు. ఇదంతా కూడా దుల్కర్ సల్మాన్ వల్లే జరిగిందని అనుపమ అన్నారు.


End of Article

You may also like